సీత వచ్చేసింది.. `ఆర్‌ ఆర్‌ ఆర్‌`కి గ్లామర్‌ యాడ్‌ అయ్యింది..

First Published Dec 7, 2020, 4:18 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా సెట్‌లో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ వచ్చి చేరారు. సందడి చేశారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో సీత పాత్రలో అలియా భట్‌ నటిస్తుంది. ఆమె రామ్‌చరణ్‌ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకి లేడీ పెయిర్‌గా, ఆయన మరదలి పాత్రలో కనిపించనున్నారు.

సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో అలియా భట్‌ జాయిన్‌ అయ్యారు. అయితే ఆమె ఇందులో నటిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటికి తాజా ఎంట్రీతో   ఫుల్‌స్టాప్‌ పెట్టింది.  `ఫైనల్‌గా... `ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నానోచ్‌` అంటూ ముంబై నుంచి హైదరాబాద్‌ ప్రయాణంలో సెల్ఫీ పోస్ట్‌ చేశారామె. సినిమాలో   తెలుగు డైలాగ్స్‌ పలికేందుకు శిక్షణ తీసుకున్నారు ఆలియా.

సెట్‌లో అలియా.. దర్శకుడు రాజమౌళి వద్ద సలహాలు సూచనలు తీసుకొట్లోంది. తన పాత్రని నటించే విషయంలో ప్రిపేర్‌ అవుతుంది. అందులో భాగంగా రాజమౌళితో సరదాగా   సంభాషించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా రాజమౌళి, నిర్మాత  దానయ్య.. అలియాకి స్వాగతం పలికారు.

ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయన లాక్‌డౌన్‌కి ముందే షూటింగ్‌లో పాల్గొన్నారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది   సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రామ్‌చరణ్‌ నటించే అల్లూరి సీతారామరాజు పాత్రని టీజర్‌ని విడుదల చేశారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో రూపొందించిన ఈ టీజర్‌ ఆకట్టుకుంది.

మరోవైపు ఇటీవల విడుదలైన చేసిన ఎన్టీఆర్‌ నటించే కొమురంభీమ్‌ పాత్ర టీజర్‌ సైతం వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. దీనికి అభిమానులు మీమ్స్   వీడియోలు చేయడం విశేషం.

ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ నటిస్తుంది. అలాగే   పోషిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని, పలువురు విదేశీ నటులు ఇందులో కీలక పాత్ర పోసిస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?