నాగార్జునపై సంచలన కామెంట్‌ చేసిన అఖిల్‌ తల్లి.. సెలైంట్‌ అయిన అఖిల్‌

First Published Dec 23, 2020, 4:30 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఫైనల్‌గా అభిజిత్‌ గెలుపొందాడు. అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు. సోహైల్‌ టాప్‌ 3లో, అరియానా టాప్‌ 4గా, హారిక టాప్‌ 5గా నిలిచింది. షో పూర్తయి మూడు రోజులవుతుంది. ఇంకా బిగ్‌బాస్ హడావుడి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అఖిల్‌ తల్లి నాగార్జునపై పలు షాకింగ్‌ కామెంట్ చేసింది. 

ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌4 తెలుగు గ్రాండ్‌ ఫినాలెలో నాగార్జున విన్నర్‌ని ప్రకటించాడు. అభిజిత్‌ విన్నర్‌ అని చెప్పే క్రమంలో ఆయన అఖిల్‌ చేయిని దించేశాడు. ఆ దించే  విధానంపై సోషల్‌ మీడియాలో విపరీతమైన కామెంట్లు వినిపించాయి. ఆ వీడియోని నెటిజన్లు ట్రోల్‌ చేశారు. నాగార్జున.. అఖిల్‌ చేయిని సడెన్‌గా వదిలేసిన విధానం చాలా  రూడ్‌గా ఉందంటూ అఖిల్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ఇది బాగా హల్‌చల్‌ చేసింది.

దీనిపై తాజాగా అఖిల్‌ తల్లి సరోజా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నాగార్జునపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని అఖిల్  కోరుకున్నాడని సీజన్ 4లో అఖిల్ రన్నర్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందనన్నారు. బిగ్ బాస్ హౌస్ లో రెండో పొజిషన్ వరకు ఉంటాడని అఖిల్ తనకు చెప్పాడని ఆ  మాటను నిలబెట్టుకున్నాడని ఆమె అన్నారు.

బిగ్ బాస్ రన్నర్ అయినా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంతో పాటు అభిమానుల హృదయాలను అఖిల్ గెలుచుకున్నాడని, అది మాకు మరింత  సంతోషాన్నిచ్చిందని తెలిపింది. కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించే సమయంలో నాగార్జున ఒక్కసారిగా చేతిని విదిలించడం తనకు బాధ కలిగించిందని ఆమె తెలిపారు.  సోహెల్ గేమ్ ను గేమ్ లా చూశాడని అతను 25 లక్షలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంలో తనకు తప్పేం అనిపించలేదని చెప్పింది.

ఓ వైపు అభిమానులు, మరోవైపు అఖిల్‌ తల్లినే అఖిల్‌కి జరిగిన అన్యాయంపై కామెంట్‌ చేయడంతో ఇప్పుడు నాగార్జునపై విమర్శలు గుప్పుమంటున్నాయి. చాలా మంది  అభిమానులను దీన్ని ట్రోల్‌ కూడా చేశారు. అఖిల్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అంతేకాదు ఈ మొత్తం గేమ్‌లో అఖిల్‌ బకరా అయ్యాడని, సోహైల్‌ తెలివిగా నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ని తీసుకుని బెనిఫిట్‌ పొందాడని, ప్రత్యేకంగా నాగార్జున పది లక్షలివ్వడం  వంటి వాటితో హైలైట్‌ అయ్యాడు. అంతేకాదు చిరంజీవి సైతం సోహైల్‌ని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఇక విజేతగా నిలిచిన అభిజిత్‌ ఎట్టకేలకు ప్రైజ్‌మనీతో జాక్‌పాట్‌ కొట్టేశాడు.

అందరిలోకెళ్లా రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌కి మొండిచేయినే ఎదురైంది. ఆయనకు బిగ్‌బాస్‌ ఇచ్చే రెగ్యులర్‌ రెమ్యూనరేషన్‌ తప్ప ఇంకేమి మిగలలేదు. నిజానికి అఖిల్‌ హౌజ్‌లో  బాగా యాక్టివ్‌గా ఉన్నారు. సోహైల్‌, అభిజిత్‌లతో పోల్చితే అఖిల్‌ చాలా గేమ్స్ లో విన్నర్‌గా నిలిచాడు. కానీ ఇవేవీ ఆయన్ని విన్నర్‌గా నిలుపలేకపోయాయి.

మరోవైపు బిగ్‌బాస్‌ 4జరిగిన 105 రోజుల్లో సగానికిపైగా రోజుల్లో అఖిల్‌ గురించిన చర్చే జరిగింది. ఆయన, మోనాల్‌ మధ్య ఉన్న లవ్‌ స్టోరీనే బిగ్‌బాస్‌ కూడా హైలైట్‌ చేశారు.

అఖిల్‌, మోనాల్‌ మధ్య కెమిస్ట్రీ రియల్‌ లవ్‌ స్టోరీని తలపించింది. దీంతో వీరి లవ్‌ స్టోరీ బాగా హైలైట్‌ అయ్యింది. వీరి గురించే బయటకూడా చర్చ జరిగింది. ఇక సోషల్‌  మీడియాలో వీరి లవ్‌ మ్యాటర్స్ కి సంబంధించి మీమ్స్ కి, సెటైర్లకి హద్దే లేదని చెప్పొచ్చు.

ఇవన్నీ బిగ్‌బాస్‌పై అటెన్షన్‌ పెంచేందుకు తప్ప, ఇంకా దేనికీ పనికి రాలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతో సిన్సియర్‌గా ఉన్న అఖిల్‌కి రన్నరప్ గా నిలిచినా ఎలాంటి ఎక్స్  ట్రా ప్రయోజనాలు పొందకపోవడం, అభిజిత్‌, సోహైల్‌కి వచ్చినంత హైప్‌, క్రేజ్‌ రాకపోవడం, ఫైనల్‌ లో కూడా చిరంజీవి సోహైల్‌నే హైలైట్‌ చేశాడుగానీ అఖిల్‌ అంతగా హైలైట్‌  చేయలేకపోయాడు. ఇక నాగార్జున అలా చేయడం వంటివన్నీ అఖిల్‌కి తీవ్రంగా అన్యాయం చేశాయని నెటిజన్లు, అఖిల్‌ అభిమానులు అంటున్నారు.

మరోవైపు అఖిల్‌పై మీడియా అటెన్షన్‌ కూడా లేదు. ఫైనల్‌ అయిపోయిందో లేదో అభిజిత్‌, సోహైల్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుసగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ హల్‌చల్‌  చేస్తున్నారు. ఎక్కడ చూసినా వీరి ఇంటర్వ్యూ వీడియోలే కనిపిస్తున్నాయి. కానీ అఖిల్‌ ఇంటర్వ్యూలు కనిపించడం. లేదు. ఇప్పుడిప్పుడే ఆయనతో ఇంటర్వ్యూలు  తీసుకుంటున్నారు.

ఇక అవకాశాల పరంగానూ సోహైల్‌కి, అభిజిత్‌కి ఆఫర్స్ వరిస్తున్నాయి. అభిజిత్‌కి రెండు సినిమాలు, పలు వెబ్‌ సిరీస్‌ ఆఫర్స్ వచ్చాయి. సోహైల్‌కి ఏకంగా స్టార్‌మానే ఓ షోకి  ఆఫర్‌ చేసినట్టు సమాచారం. అలాగే హీరోగానూ ఛాన్స్ లు వస్తున్నట్టు టాక్‌. కానీ అఖిల్‌ విషయంలో అలాంటి వార్తే లేదు. దీంతో చివరికి అఖిల్‌ కూరలో కరివేపాకులాగానే  మిగిలిపోయాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?