- Home
- Entertainment
- Janaki Kalaganaledu: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న అఖిల్.. జానకి కల నెరవేర్చే ప్రయత్నంలో రామచంద్ర?
Janaki Kalaganaledu: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న అఖిల్.. జానకి కల నెరవేర్చే ప్రయత్నంలో రామచంద్ర?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 3వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్లో జానకి చదువుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జెస్సి వచ్చి అక్క నీకు ఒక న్యూస్ అని చెప్పడంతో ఏంటి చేసి అనగా నువ్వు చెప్పినట్టు నేను మా నాన్నని అడిగాను మా నాన్న అఖిల్ కి జాబ్ చూశాడు అఖిల్ కి జాబ్ వచ్చింది అనడంతో జానకి సంతోష పడుతూ ఉంటుంది. చాలా సంతోషం జెస్సి అనగా ఇదంతా నీ వల్లే అక్క నువ్వు చెప్పడం వల్లే నేను మా నాన్నని అడిగాను అని అంటుంది జెస్సి. అప్పుడు అఖిల్ అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ వచ్చి ఏంట్రా అనగా నన్ను ఎందుకు పనికిరాని వాడిని అన్నట్లు మాట్లాడారు కదా, అన్నయ్య ఒకటే కాదు మేము కూడా కష్టపడుతాము. నేను చదువుకున్నాను కాబట్టి అన్నయ్య లాగా ఏ పని చేయలేను అని అంటాడు.
అప్పుడు గోవిందరాజులు వాడేమీ చేయకూడని పని చేయడం లేదు అంటాడు. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది నేను సంపాదిస్తాను అనడంతో జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది. ఇంతకీ నీ జీతం ఎంత అని గోవిందరాజులు అడగక 15 వేలు అని చెప్పడంతో జెస్సి,జానకి ఇద్దరు షాక్ అవుతారు. అంత చదువు చదివాను అని చెప్పావు 15,వేలుకి జాయిన్ అయ్యావా అనడంతో చేరగానే లక్షలు ఇవ్వరు కదా అంటాడు. అవన్నీ సరే నువ్వు వెళ్లి భోజనం చేసి పడుకో అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జెస్సి కోపంతో అఖిల్ ని నిలదీయడానికి లోపలికి వెళుతుంది. నీకు జీతం ఎంత 30 వేలు అనగా మరి అబద్ధం ఎందుకు చెప్పావు అనడంతో నిజం ఏంటో చెప్తే జరిగే విషయాలు ఏంటో నీకు తెలియదు నాకు మౌనంగా ఉండు అని అంటాడు.
ఏం జరుగుతుంది అఖిల్ అని జెస్సి అడగడంతో 30 వేలు అని చెబితే డబ్బులు మొత్తం వాళ్లకి ఇవ్వాలి వాళ్ళు నాకేం చేయనప్పుడు నేను వాళ్ల కోసం ఎందుకు చేయాలి అనడంతో ఏమి చేయకుండానే వాళ్ళు నిన్ను ఇంత పెద్ద చేశారా నిన్ను ఇంత పెద్ద చదువులు చదివించారా అనడంతో అది వాళ్ళ బాధ్యత అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు అఖిల్. ఈ ఇంట్లో ఉండడం వల్లే నువ్వు ఇలా తయారవుతున్నావు నా ఫస్ట్ జీతం రాగానే సపరేట్ కాపురం పెడదాము అనడంతో ఇంట్లో వాళ్ళని వదిలేస్తావా అఖిల్ అనడంతో నాకు ఎక్కువ కోపం తెప్పిస్తే నిన్ను కూడా వదిలేస్తాను అంటాడు అఖిల్. ఆ మాటకు జెస్సి షాక్ అవుతుంది.
మరోవైపు మల్లిక మంచి రోజులు వచ్చాయి అని పాట పెట్టుకుని ఆనందంగా డాన్సులు వేస్తూ ఉంటుంది. ఏం జరిగింది మల్లిక అనడంతో మనకు మంచి రోజులు వచ్చాయి నీళ్లు వదిలి మనం వెళ్లిపోయే సమయం వచ్చింది అని అంటాడు. అఖిల్ కి కూడ జాబ్ వచ్చింది వాళ్ళు ఎలాగో ఇక్కడ ఉండరు మనం కూడా ఇక్కడ ఉండము అనడంతో మనల్ని అమ్మ వెళ్ళనివ్వదు కదా అంటాడు విష్ణు. మనం వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఆ 20 లక్షలు అప్పు మనం నెత్తి మీద పడుతుంది అందుకే వెళ్లిపోదాము అంటుంది మల్లిక. మరి అందరూ వెళ్ళిపోతే అమ్మానాన్నలను ఎవరు చూసుకుంటారు అనడంతో వాళ్లకి ఇష్టమైన మీ అన్న వదిన ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని అంటుంది మల్లిక. మనము ఇక్కడే ఉండాలి అంటే అప్పు తీర్చడానికి లేదంటే మన జీవితకాలం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని మల్లిక అంటుంది.
ఆ తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక చేతికి కాస్త రెండు చేతులు కూడా అయ్యాయి. ఆ అప్పులు మొత్తం తీరిపోయి సంతోషంగా ఉండవచ్చు అని అంటాడు గోవిందరాజులు. అప్పుడే మర్చిపోయాను జానకి ఇంతకుముందు పనులు చేసేది కానీ ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇంటి పని వంట పని చేయడానికి ఎవరూ లేరు అనడంతో నా ఫ్రెండ్ కు తెలిసిన ఒక వంట అతను ఉన్నాడు అతని పిలిపిస్తాను అని గోవిందరాజులు వంట మనిషి కోసం ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత జానకి పని చేసుకుంటూ ఉండగా ఇంతలో రామచంద్ర అక్కడికి వస్తాడు. సరే జానకి గారు ఇది పని తర్వాత చూసుకుందాం ముందు వెళ్లి మీరు శుభ్రంగా చేతులు కడుక్కుని రండి అని అంటాడు.
అప్పుడు జానకి వెళ్లి చేతులు అర్ధం చేసుకుని రాక అప్పుడు రామచంద్ర జానకి అడిగిన ఐపీఎస్ ఐఏఎస్ పుస్తకము ఇవ్వడంతో జానకి సంతోషంతో మనసుకు హత్తుకుంటుంది. అప్పుడు రామచంద్ర ని హత్తుకుంటుంది జానకి. మీరు అప్పుడే అడిగారు కానీ ఇంట్లో పరిస్థితులు వల్ల కొనివ్వలేకపోయాను నన్ను క్షమించండి జానకి గారు అని అంటాడు రామచంద్ర. చిన్న దానికే క్షమించమని అడగడమేంటి రామా గారు అనడంతో విషయం కాదు జానకి గారు నేను చిన్నప్పుడే కోల్పోయిన చదువుకొని మీ ద్వారా నిజం చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు రామచంద్ర. మీరు ఏ విషయాన్ని మనసులో దాచుకోకండి. మీరు ఐఏఎస్ అవ్వాలి మేము మల్లి పోలీస్ డ్రెస్ లో చూడాలి అప్పుడు నేను అందరికీ గర్వంగా చెప్పుకుంటాను అంటాడు రామచంద్ర.
నా లక్ష్యం మీ లక్ష్యమైనప్పుడు నేను తప్పకుండా సాధిస్తాను అనడంతో తప్పకుండా సాధించాలి జానకి గారు అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి సంతోషంతో ఎమోషనల్ అవుతూ ఉండగా రామచంద్ర కన్నీళ్లు తుడుస్తాడు. జెస్సీ ఆరోగ్యం కూడా బాగుందని డాక్టర్ చెప్పారు అనడంతో రామచంద్ర మరింత సంతోష పడుతూ ఉంటాడు. కానీ అత్తయ్య గారు మాట్లాడలేదని బాధగా ఉంది అనడంతో మీరేం బాధపడకండి అమ్మ తొందరలోనే మాట్లాడుతుంది అని ధైర్యం చెబుతాడు రామచంద్ర. తర్వాత మల్లిక చేతివేళ్లకి నైల్ పాలిష్ పెట్టుకుంటూ ఉండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి అమ్మ మల్లిక కాఫీ కావాలి అనడంతో నేను అదే చూస్తున్న మావయ్య ఎవరైనా కాఫీ ఇస్తారేమో అని అంటుంది. అప్పుడు మల్లిక ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ పనికి తప్పించుకుంటుంది.
ఇంతలో ఒక అతను వచ్చి ఇంట్లో ఎవరు ఉన్నారు చాటో చాటు అనడంతో ఎవడు వీడు అనుకుంటూ మల్లిక బయటకు వెళ్తుంది. ఇంతలోనే నైట్ గోవిందరాజులు చెప్పిన పనివాడు రావడంతో మల్లిక అతనితో సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే గోవిందరాజులు వచ్చి ఆ మలయాళం పనివాడు గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఒంట్లో ఉండే వాళ్లకే చోటు లేదంటే మళ్లీ వీడు ఎందుకు అని అంటుంది మల్లిక. అప్పుడు గోవిందరాజులు మల్లికకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. అప్పుడు ఆ మలయాళం మన గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు మనకు అసలు వంటనే రాదు కదా అని అనుకుంటూ ఉంటాడు. వంట రాదని చెప్పడం కంటే ముందే వంట వచ్చు అని కమిట్ అయిపోవడం బెటర్ అనుకుంటూ గోవిందరాజులు అబద్ధం చెబుతాడు.