- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య రాజేశ్, మైండ్ బ్లాక్ పోజులతో కవ్విస్తున్న డస్కీ బ్యూటీ..
బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య రాజేశ్, మైండ్ బ్లాక్ పోజులతో కవ్విస్తున్న డస్కీ బ్యూటీ..
తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులతో పాటు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మతిపోయే ఫోజులతో టెంప్ట్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కోలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. ఈ బ్యూటీకి ఇటు తెలుగు మరియు మలయాళ ప్రేక్షకులతోనూ మంచి పరిచయమే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాల్లోనే నటించిన ఆడియెన్స్ ను మెప్పించ గలిగింది.
తొలుత కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అవరేజ్ గా ఆడింది. అయినా ఐశ్వర్య రాజేశ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆమె డస్కీ బ్యూటీకి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగు వరుస ఆఫర్లు అందుకుంటోంది.
తెలుగులో ఐశ్వర్య నటించిన రెండో చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన పల్లెటూరి ఇల్లాలి పాత్రను పోషించింది. ఆ రోల్ లో వందశాతం అవుట్ పుట్ ను ఇవ్వడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ బ్యూటీ.
గతేడాది ఏకంగా రెండు చిత్రాల్లో మెరిసి అభిమానులను ఫిదా చేసింది. నేచురల్ స్టార్ నాని సరసన ‘టక్ జగదీష్’ చిత్రంలో నటించి ఆడియెన్స్ తో సూపర్ అనిపించుకుంది. ఆ వెంటనే రిలీజ్ అయిన ‘రిపబ్లిక్’ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సరసన నటించింది.
‘రిపబ్లిక్’ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఐశ్వర్యా రాజేశ్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది. మున్ముందు ఐశ్వర్య మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో కలిసి అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇటు సోషల్ మీడియాలోనూ ఐశ్వర్య రాజేశ్ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లోనే ఆకట్టుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కవ్వించేలా ఉన్న ఐశ్వర్య రాజేశ్ పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఆ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.