Sai Pallavi : దట్ ఈజ్ సాయి పల్లవి.. న్యూ ఈయర్ రోజు ఏం చేసిందో తెలుసా?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallavi ఎప్పుడూ తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు. స్పెషల్ డేస్ ను తనదైన శైలిలో జరుపుకుంటూ ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక న్యూ ఈయర్ వేడుకలను కూడా ట్రెడిషనల్ పద్ధతిలో జరుపుకున్నారు.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో, ఎంచుకునే పాత్రలతో ఎప్పుడూ వెండితెరపై ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంటుంది. కొన్నాళ్లుగా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో ఇండస్ట్రీలో సాయిపల్లవి తనదైన ముద్ర వేసుకున్నారు. హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా.. వ్యక్తిగతంగానూ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది.
వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్న సాయిపల్లవి ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన పోస్టులతో ఆకట్టుకుంటుంటారు. ఇక తాజాగా న్యూ సెలబ్రేషన్స్ ను తనదైన శైలిలో జరుపుకొని ప్రశంసలు పొందుతున్నారు.
చాలా మంది సెలబ్రెటీలు రిసార్టులు, పార్టీ, ఈవెంట్లలో మెరిస్తే.. సాయి పల్లవి మాత్రం దేవాలయంలో కనిపించింది. కొత్త సంవత్సరం New Year 2024 సందర్భంగా సాయిపల్లవి పుట్టపర్తి సాయి బాబా Sai Baba ఆలయంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఈ సందర్భంగా పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకున్నారు. ప్రత్యేకమైన రోజులను ట్రెడిషనల్ వేలో నిర్వహించుకోవడం పట్ల సాయి పల్లవిని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇక సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) సరసన ‘తండేల్’ Thandel మూవీలో నటిస్తోంది. తాజాగా కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్ లోనూ పాల్గొంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను అందించింది. ఈ చిత్రానికి చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు.