టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి... వైరల్ అవుతున్న వీడియో
ఈ తరం లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ప్రగతి ఒకరు. ఆమె చాలా కాలంగా హీరో, హీరోయిన్ తల్లి, వదిన, అత్త పాత్రలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఆమె ఉన్నారు.
అలాగే ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. ఆమె యంగ్ హీరోయిన్ రేంజ్ లో ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి హాట్ స్టెప్స్ వేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు చూసిన నెటిజెన్స్ షాక్ అవుతూ ఉంటారు.
ఇక ఫిట్నెస్ పరంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రగతి. గంటల తరబడి జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియోలు కూడా ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ పై అనేక మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రగతి మాత్రం అసలు పట్టించుకోదు. అలాగే ఎగతాళి చేసినవారికి వెంటనే కౌంటర్ వేస్తుంది.
ఇక ప్రగతికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, అమ్మాయి. వీరిద్దరూ టీనేజ్ లో ఉన్నారు. కూతురు గీత 16వ పుట్టినరోజు జరుపుకున్నట్లు సమాచారం.
పిల్లలే తన ప్రపంచం అనే ప్రగతి, షూటింగ్స్ లేని సమయంలో వారితో గడపడానికి ఇష్టపడతారు. తాజాగా ఓ ఆసక్తికర వీడియో కూతురుతో కలిసి చేశారు ఆమె.
మొదట సిల్క్ అనే పదం ఐదుసార్లు పలకాలని ప్రగతి కూతురుతో అన్నారు. ఐదుసార్లు కరెక్ట్ గా సిల్క్ అని గీత పలికారు. ఆ తరువాత సిల్క్ స్పెల్లింగ్ చెప్పాలని అడిగింది ప్రగతి. అది కూడా గీత కరెక్ట్ గా చెప్పింది.
చివరిగా ఆవు ఏమి తాగుతుందని అడుగా... మిల్క్ అంటూ గీత సమాధానం చెప్పింది. దానికి ఓడిపోయావ్ అన్నట్లుగా ప్రగతి గట్టిగా నవ్వడంతో, గీత కూడా నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.