- Home
- Entertainment
- చిలిపి పోజులతో నెట్టింట పూర్ణ అల్లరి.. శారీలో క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న ‘ఢీ’ బ్యూటీ..
చిలిపి పోజులతో నెట్టింట పూర్ణ అల్లరి.. శారీలో క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న ‘ఢీ’ బ్యూటీ..
కేరళ బ్యూటీ పూర్ణ (Poorna) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. పలు సినిమాలు, టెలివిజన్ షోలతో ఎప్పుడూ వారికి దగ్గరగానే ఉంటుంది. ఇటు సోషల్ మీడియాలోనూ శారీ లుక్ లో సందడి చేస్తోందీ బ్యూటీ.

మలయాళ నటి పూర్ణ (Poorna) కెరీర్ 2004లో మొదలైంది. అంతకు ముందు ప్రొఫెషనల్ డాన్సర్ గా, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ఆ పాపులారిటీతోనే సినీ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చింది.
2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘సీమ టపాకాయ్’లో నటించి మరింత గుర్తింపు పొందింది. పూర్ణ అభినయం, అందానికి తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా కనిపించడం ఆమె ప్రత్యేకత. అదే ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది.
అటు మలయాళం, ఇటు తెలుగు, తమిళంతోని పలు చిత్రాల్లో ఇప్పటికీ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ లో పూర్ణ కేరీర్ కు ఢోకా లేదు. అమ్మడు స్పీడ్ పంచాలే గానీ.. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆయా చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తోంది.
సౌత్ లో దాదాపు అన్ని భాషల చిత్రాల్లో పూర్ణ నటించి ప్రేక్షకులను అలరించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. టీవీ షోలోనూ సందడి చేస్తూ వచ్చింది. దీంతో టెలివిజన ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. ముఖ్యంగా పూర్ణ ‘ఢీ’ డాన్స్ షోతో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.
అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైన మెరుస్తున్న నటి పూర్ణ.. సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. పూర్ణ సినిమాల్లో కంటే నెట్టింటే ఎక్కువగా తన అభిమానులను అలరిస్తుందని చెప్పాలి. అంటే ఆ రేంజ్ లో ఫొటోషూట్లు చేస్తూ వస్తోందీ బ్యూటీ.
తాజాగా మరిన్ని పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ పిక్స్ లో పూర్న బ్లూ శారీలో మతిపోగొడుతోంది. శారీలో లుక్ లో అచ్చమైన తెలుగమ్మాయిని పోలి ఉంది. సంప్రదాయ దుస్తుల్లో నెటిజన్ల మనస్సును దోచుకుంటోంది. కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకుంటోంది.
అయితే నటి పూర్ణకు సంప్రదాయ దుస్తులు అంటే ఎంతలా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ శారీలోనే తన అభిమానులకు పలకరిస్తుంటుంది. మరోవైపు ఈవెంట్లకు కూడా చీరకట్లులోనే హాజరై అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. తాజాగా తన పిక్స్ ను షేర్ చేస్తూ.. చీరపై తనకున్న ప్రేమను తెలియజేసింది.
లేటెస్ట్ ఫొటోషూట్ లో చిలిపి ఫోజులుచ్చిన పూర్ణ కుర్రాళ్ల చూపుతిప్పుకోనివ్వడం లేదు. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ‘నా కంఫర్ట్ అవుట్‌ఫిట్ మరియు నాకు ఇష్టమైన లుక్ ఎప్పుడూ చీర’నే అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు.