Neha Shetty Pics : కాశ్మీర్ యాపిల్ లా మెరిసిపోతున్న నేహా శెట్టి.. రాధిక చూపులకు కుర్రాళ్లు ఆగం..
‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. గుచ్చె చూపులతో నెటిజన్ల మతిపోగోడొతోందీ రాధిక. లేటెస్ట్ ఫొటోషూట్ తో తన క్రేజ్ పెంచుకుంటోంది.
నేహా శెట్టి తన కేరీర్ ను మోడల్ గా స్టార్ చేసింది. ఈ బ్యూటీ ప్రధానంగా కన్నడ మరియు తెలుగు సినిమాలలో నటిస్తోంది. మోడల్‌గా, ఆమె 2014 పోటీ చేసి మిస్ మంగళూరు టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2015 మిస్ సౌత్-ఇండియా పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది.
నేహా 2016లో కన్నడ చిత్రం ‘ముంగారు మలే 2’లో తొలిసారిగా హీరోయిన్ గా నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంగారు మలే’కి సీక్వెల్.. ఈ చిత్రంలో నేహా శెట్టి కన్నడ హీరో గణేష్ సరసన నటించింది.
ఈ చిత్రంతో నేహా శెట్టి నటనకు విమ్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ముంగారు మలేలో నేహా చేసిన నందిని పాత్రకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో తొలుత యంగ్ హీరో ఆకాశ్ పూరితో కలిసి ‘మెహబూబా’ చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నేహాకు అంతగా పాపులారిటీ దక్కలేదు. ఆ తర్వాత హీరో సందీప్ కిషణ్ నటించిన ‘గల్లీ రౌడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కొంత పర్లేదు అనిపించుకుంది.
కానీ ఈ ఏడాది సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వచ్చిన ‘డీజే టిల్లు’ DJ Tillu చిత్రంలో రాధిక పాత్రలో నటించి ఆడియెన్స్ ను అలరించింది. సిద్దు జొన్నలగడ్డ (siddu jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో నేహా శెట్టికి కూడా పాపులారిటీని దక్కించుకుంది.
ప్రస్తుతం డీజే టిల్లు మూవీ సక్సెస్ ను ఎంజాయి చేస్తోంది ఈ బ్యూటీ. మరోవైపు సోషల్ మీడియాలోనూ రాధిక కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టె పనిలో బిజీగా ఉంది. ఈ మేరకు లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తను ట్రెడిషినల్ వేర్ లో కాశ్మీర్ యాపిల్ గా మెరిపిపోతోంది. నేహా గ్లామర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.