- Home
- Entertainment
- Nabha Natesh Pics : ఎరుపెక్కిన అందాలతో మైమరిపిస్తున్న నభా నటేష్.. లెహంగా వోణీలో మతిపోయే ఫోజులు..
Nabha Natesh Pics : ఎరుపెక్కిన అందాలతో మైమరిపిస్తున్న నభా నటేష్.. లెహంగా వోణీలో మతిపోయే ఫోజులు..
ఇస్మార్ట్ బ్యూటీ, హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) అందాల విందు చేస్తోంది. తాజాగా రెడ్ లెహంగాలో నడుమందాలు చూపిస్తూ తన వైపు కుర్రకారును ఆకర్షిస్తోందీ బ్యూటీ.

గ్లామర్ బ్యూటీ నభా నటేష్ తెలుగు స్టార్ హీరోయిన్ రేసులో ఉంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ సుందరి తెలుగులోనే వరుస చిత్రాల్లో నటిస్తోంది. తన కేరీర్ ను కన్నడ చిత్రాలతోనే స్టార్ట్ చేసినా.. టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది.
ఇస్మార్ శంకర్ (iSmart Shankar) సినిమాతో నభా నటేష్ స్టార్ డమ్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అమ్మాయి క్యారెక్టర్ లో నటించి అలరించింది. నభా నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా విజయవంతం అవడంతో నభా నటేష్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ లాంటి చిత్రాల్లో నటించిందీ బ్యూటీ. చివరిగా నితిన్ (Nithiin) ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయింది.
అయితే అటు సినిమాల్లో నటిస్తూ అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫొటోషూట్లతో అభిమానులను ఖుషీ చేస్తోంది. ఉగాది సందర్భంగా ట్రెడిషినల్ దుస్తుల్లో కనిపించిన ఈ సుందరి.. తాజాగా మరిన్ని ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
ఈ ఫొటోల్లో నభా రెడ్ లెహంగా, బ్లాజ్ లో ఆకట్టుకుంటోంది. నడుము అందాలు, నాభి సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. కొంటె చూపులతో మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలను అభిమానులు లైక్ చేస్తూ నభా గ్లామర్ కు ఫిదా అవుతున్నారు.