ట్రెండీ వేర్ లో మాళవిక మోహన్ స్టన్నింగ్ లుక్.. థైస్ షోతో యంగ్ బ్యూటీ కిర్రాక్ పోజలు..
మలయాళీ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ట్రెండీ వేర్స్ లో మెరుపులు మెరిపిస్తోంది. నయా లుక్స్ తో కిర్రాక్ పోజులిస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో సందడి చేస్తూనే వస్తోంది. స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటూ తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటోంది. కేరళలకు చెందిన ఈ ముద్దు నటిగా అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తోంది.
మలయాళ చిత్రాలతో కేరీర్ ను ప్రారంభించిన మాళవికా మోహనన్ ప్రస్తుతం కోలీవుడ్ ఫుల్ బిజీగా మారింది. ఈ క్రమంలోనే కన్నడ, మరియు హిందీలోనూ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ గురి టాలీవుడ్ పై ఉంది. తర్వలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిత్రంలో మాళవికా మోహనన్ నటిగా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల షూటింగ్ కు కూడా హాజరైందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం మాళవికా మోహనన్ ఎప్పుడూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో తన అభిమానులను అలరిస్తూనే వస్తున్నది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా మైమరిపిస్తోంది.
తాజాగా వైట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. నయా లుక్ లో యంగ్ బ్యూటీ స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు థైస్ అందాలతో మంత్రముగ్ధులను చేసింది. మాళవికా పంచుకున్న పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘పేట’, ‘మాస్టర్’, వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను అలరించింది మాళవిక మోహనన్. ప్రస్తుతం చియాన్ విక్రమ్ సరసన ‘తంగలన్’ (Thangalaan)లో నటిస్తోంది. అటు హిందీలో ‘యుద్ర’అనే చిత్రంలోనూ మెరియనుంది. త్వరలోఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి బాగా ప్రయత్నిస్తోంది.