నేనూ లైంగిక బాధితురాలినేః కస్తూరి షాకింగ్ కామెంట్
ఓ వైపు డ్రగ్ కేసు, మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్స్ కేసు లింకులు బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్, శాండల్‌వుడ్‌కి కూడా పాకాయి. ఈ నేపథ్యంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సీనియర్ నటి కస్తూరి శంకర్ అంటున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఘాటైన అందాలతో మెప్పించిన కస్తూరి తన కెరీర్ ప్రారంభంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపింది.
బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
దీనిపై అనేక మంది సెలబ్రిటీలు స్పందించి అనురాగ్‌పై చర్యలు తీసుకోవాలంటున్నారు. అదే సమయంలో మరికొందరు అనురాగ్ అలాంటి వాడు కాదని ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.
ఈ వేడి ఓ వైపు నడుస్తూనే ఉంది. తాజాగా సౌత్ నటి కస్తూరి తాను కెరీర్ మొదలు పెట్టినప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది.
ఆమె చెబుతూ, అనురాగ్‌పై పాయల్ చేసిన ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని తెలిపింది. అనురాగ్‌పై ఆరోపణలు కోర్ట్ లో నిలవవని చెప్పింది.
ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని, దీని వల్ల ఎవరో ఒకరి కెరీర్ స్పాయిల్ అవుతుందని ట్వీట్ చేసింది.
దీనిపై ఓ నెటిజన్ `ఇలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలానే మాట్లాడతారా?` అని ప్రశ్నించగా, నా కుటుంబంలో ఏంటి? నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను కూడా బాధితురాలినే` అని షాకింగ్ కామెంట్ చేసింది.
తెలుగులో ఆమె `గ్యాంగ్‌వార్`, `నిప్పురవ్వ`, `గాడ్ ఫాదర్`, `మెరుపు`, `చిలక్కొట్టుడు`, `అన్నమయ్య`, `మా ఆయన బంగారం`, `ఆకాశ వీధిలో`, `డాన్ శ్రీను`, `శమంతకమణి` చిత్రాల్లో నటించింది.
ఆంటీగా, గ్లామర్ తరహా పాత్రలు పోషిస్తున్న కస్తూరి ప్రధానంగా తమిళం నటిగా రాణిస్తున్నారు. ఇటీవల తమిళంలో బిజీ అయిన కస్తూరి ప్రస్తుతం తెలుగులో `ఇంటింటి గృహలక్ష్మి` సీరియల్‌లో నటిస్తుంది.
ఇటీవల కూడా పలు సంచలన వ్యాఖ్యలతో కస్తూరి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.