తలకిందులుగా వేళాడుతూ హన్సికా మోత్వానీ వర్కౌట్స్.. బాడీని స్ప్రింగ్ లా వంచేసిందిగా!
రోజురోజుకు యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ Hansika Motwani మరింత ఫిట్ గా, యంగ్ గా కనిపిస్తున్నారు. దీని వెనక ఎంతలా శ్రమిస్తుందో తాజా పోస్టుతో తెలియజేసింది.

సీనియర్ నటి హన్సికా మోత్వానీ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ఈక్రమంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో సినిమాతో అలరిస్తూ వస్తోంది.
రీసెంట్ గానే హన్సికా ‘105 మినిట్స్’ అనే వన్ షార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే పాత్రతో రెండు గంటలు సాగిన చిత్రమే ఇది. మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే దక్కుతోంది.
ఈ క్రమంలో హన్సికా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా గురి పెట్టింది. దీంతో మళ్లీ షూటింగ్స్ కు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తను జిమ్ ఫొటోలను పంచుకుంది.
జిమ్ లో హన్సికా వర్కౌట్స్ ఆసక్తికరంగా మారింది. ఏరియల్ యోగాలాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ లో రాడ్ లకు వేళాడుతూ బాడీని స్పింగ్ లా వచేసింది. శరీరాన్ని సాగదీస్తూ మరింత ఫిట్ గా, స్లిమ్ గా మారేందుకు ప్రయత్నిస్తోంది.
హన్సికా మోత్వానీ వర్కౌట్స్ ను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యాపిల్ బ్యూటీ ఇంత అందంగా మెరియడానికి, ఫిట్ గా ఉండటానికి ఇలాంటి వర్కౌట్స్ చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇలా తరుచుగా హన్సికా తన వర్కౌట్స్ వీడియోలు, ఫొటోలను పంచుకుంటూనే ఉంది. ఫిట్ నెస్ లవర్స్ ను మరింతగా స్ఫూర్తినిస్తోంది. ఇక హన్సికా తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రౌడీ బేబీ, గార్డియన్, మ్యాన్ వంటి సినిమాల్లో చేస్తోంది.