- Home
- Entertainment
- సమంత, నాగ చైతన్యపై బ్రహ్మాజీ కామెంట్స్.. రూ.250 కోట్లు తీసుకుంది అన్నందుకే గట్టిగా ఇచ్చా..
సమంత, నాగ చైతన్యపై బ్రహ్మాజీ కామెంట్స్.. రూ.250 కోట్లు తీసుకుంది అన్నందుకే గట్టిగా ఇచ్చా..
నటుడు బ్రహ్మాజీ దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. అయినప్పటికీ బ్రహ్మాజీ ఫిట్ నెస్ హీరోలకు సైతం షాకింగే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్రహ్మాజీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

నటుడు బ్రహ్మాజీ దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. అయినప్పటికీ బ్రహ్మాజీ ఫిట్ నెస్ హీరోలకు సైతం షాకింగే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్రహ్మాజీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాజీ ఏ ఈవెంట్ లో చూసిన సరదాగా మాట్లాడడం చూశాం. ఎప్పుడూ కూల్ గా ఉండే బ్రహ్మాజీకి కొన్ని సందర్భాల్లో కోపం వస్తుందట.
సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అయినా తప్పకుండా స్పందించాలి అని బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. సెలెబ్రిటీలు చెబితే ఆ మాట ప్రజల్లోకి వెళుతుంది అని అన్నారు. ఉదాహరణకి సమంత, నాగ చైతన్య విడిపోయాక.. ఒక నెటిజన్ అనవసరంగా కామెంట్ చేశాడు. సమంతని ఉద్దేశించి.. నువ్వు నాగ చైతన్య నుంచి రూ 250 కోట్లు తీసుకున్నావు. బ్యాడ్ క్యారెక్టర్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.
అతడికి సమంత కూడా ఘాటుగా బదులిచ్చింది. నేను కూడా ఆ నెటిజన్ కామెంట్స్ కి రియాక్ట్ అయ్యా. నీకు సిగ్గు శరం లేదు. అసలు సమంత వ్యక్తిగత జీవితంతో నీకు సంబంధం ఉందా అని తిట్టినట్లు బ్రహ్మాజీ పేర్కొన్నారు. ఒక సెలెబ్రిటీతో చాట్ చేసే అవకాశం ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించాలి. సినిమాల గురించి మాట్లాడవచ్చు. ఆమె నటన నచ్చకపోతే విమర్శించవచ్చు.
అసలు పర్సనల్ గా కామెంట్స్ చేసే హక్కు ఎక్కడ ఉంది. సమంత ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ కాలేదు. కానీ నాకు బాధ అనిపించి స్పందించినట్లు బ్రహ్మాజీ అన్నారు. సమంత కష్టపడి వర్క్ చేసి ఒక పొజిషన్ కి వచ్చింది. నాగ చైతన్యని వివాహం చేసుకుంది. ఎందుకో వాళ్ళిద్దరికీ కుదర్లేదు.. విడిపోయారు. మధ్యలో ఇలాంటి వాళ్లంతా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి అని బ్రహ్మాజీ అన్నారు.
అన్ని విమర్శలకు స్పందించ కూడదు అని అనుకుంటాం. కానీ కొన్ని కామెంట్స్ హర్టింగ్ గా ఉంటాయి అని బ్రహ్మాజీ అన్నారు. విడిపోవడం అనేది పూర్తిగా సమంత, నాగ చైతన్య వ్యక్తిగత విషయం అని అన్నారు.
డివోర్స్ తీసుకున్నందుకు నాగ చైతన్య నుంచి సమంత 200 కోట్ల రూపాయలు పొందింది అంటూ ఆమెపై అనేక నిందలు వినిపించాయి. వాటన్నింటికి సామ్ ధీటుగా బదులిచ్చింది. ప్రస్తుతం చై, సామ్ ఇద్దరూ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.