అప్పుడు పచ్చి బూతులు, ఇప్పుడిలా.. రోజా వీడియో షేర్ చేసిన బండ్ల గణేష్!

First Published 29, Mar 2020, 9:50 AM

నటి రోజా సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రోజా అందరి పొలిటీషియన్స్ కంటే భిన్నం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని  సూటిగా చెబుతారు.

నటి రోజా సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. రోజా అందరి పొలిటీషియన్స్ కంటే భిన్నం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని  సూటిగా చెబుతారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో రోజా మాటల్లో పదును వర్ణించలేం. అందుకే రోజా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.

ఇక నిర్మాత బండ్ల గణేష్ గురించి చెప్పుకుంటే.. గణేష్ ముక్కు సూటిగా మాట్లేడే వ్యక్తి. మనసులో ఉన్న విషయాన్ని అలాగే బయటపెట్టేస్తాడు. ఇక పవన్  కళ్యాణ్ ప్రస్తావన వస్తే మాత్రం ఈ బ్లాక్ బస్టర్ నిర్మాతకు పూనకాలు వచ్చేస్తాయి.

గతంలో ఓ సందర్భంలో గణేష్, రోజా మధ్య జరిగిన మాటల యుద్ధం అదుపు తప్పింది. దీనితో ఇరువురు ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. ఓ టివి ఛానల్ లో జరిగిన చర్చ కార్యక్రమంలో గణేష్, రోజా మధ్య విమర్శలు చెలరేగాయి. పవన్, బండ్ల గణేష్ పై రోజా తీవ్రమైన విమర్శలు చేసింది. దీనితో బండ్ల గణేష్ కూడా రెచ్చిపోయాడు.

వీరిద్దరి మధ్య విమర్శల గురించి చాలా కాలం మీడియాలో, అభిమానుల్లో చర్చ జరిగింది. తాజాగా మరోసారి బండ్ల గణేష్ రోజా వీడియో షేర్ చేశాడు. కాకపోతే ఈసారి ఆమెపై విమర్శలు చేయలేదు. కృతజ్ఞతలు తెలిపాడు.

కరోనా కారణంగా పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతినింది. కరోనాపై ఉన్న అపోహలతో జనాలు చికెన్ అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు ఆ అపోహల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

తాజాగా రోజా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తన ఇంట్లో చికెన్ లెగ్ పీస్ లు ఫ్రై చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో రోజా మాట్లాడుతూ.. కరోనా, ఇతర రోగాల నుంచి బయటపడడానికి.. మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చికెన్, గుడ్లు బాగా తినాలి అని తెలిపింది.

ఈ వీడియో బండ్ల గణేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒకప్పుడు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం బండ్ల గణేషే రోజాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాలం వేగంగా మారిపోతోంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రోజా ప్రస్తుతం వైసిపి తరుపున రెండవసారి నగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. బండ్ల గణేష్ ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు.

loader