రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...
First Published Dec 29, 2020, 10:42 AM IST
మొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు... తొలి టెస్టులో ఏకైక హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా లేడు. షమీ గాయం కారణంగా తప్పుకున్నాడు, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులో లేడు, రోహిత్ శర్మ ఆడడం లేదు... ఇన్ని సమస్యలున్నా, స్టార్లు లేకున్నా... టాప్ టీమ్ ఆస్ట్రేలియాను వణికిస్తూ ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకుంది టీమిండియా.

ఆడిలైడ్ పీడకల నుంచి జట్టును పడేయగలిగాడు అజింకా రహానే. రహానే కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్... టీమిండియాలోనే కాదు, భారత అభిమానుల్లోనూ తెలియని ఉత్సాహాన్ని నింపింది...

బౌలర్లకు తగ్గట్టుగా ఫీల్డింగ్ మార్చడం, బ్యాట్స్‌మెన్‌కి తగ్గట్టుగా బౌలింగ్‌లో మార్పులు చేయడం... వికెట్లు రాకపోయినా సహనంతో ఉండమని బౌలర్లకి సలహాలు ఇచ్చి జట్టులో ఉత్తేజం తీసుకొచ్చాడు రహానే...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?