మరో వివాదంలో కృనాల్ పాండ్యా... బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ హుడా ఫిర్యాదు...
First Published Jan 10, 2021, 8:55 AM IST
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత దుబాయ్ నుంచి వస్తూ భారీగా బంగారంతో ముంబై విమానాశ్రయంలో దొరికిపోయిన భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా... మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బరోడా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న కృనాల్ పాండ్యా, తనను బూతులు తిట్టాడని, తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఆల్‌రౌండర్ దీపక్ హుడా.

జనవరి 10 నుంచి ప్రారంభమవుతున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ఆడడం లేదని, దానికి కారణం కృనాల్ పాండ్యా ప్రవర్తనే కారణమంటూ ఆరోపించాడు దీపక్ హుడా.

‘నేను 11 ఏళ్లుగా బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున క్రికెట్ ఆడుతున్నాడు. ఈసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. కానీ నేను ఇప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నాను.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?