T20 వరల్డ్‌కప్ 2021కి వేదికలు షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ... హైదరాబాద్‌కి నో ఛాన్స్...
First Published Dec 23, 2020, 12:04 PM IST
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టీ20 వరల్డ్‌కప్, 2021లో నిర్వహించబోతోంది బీసీసీఐ. టీమిండియా వేదికగా జరిగే ఈ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పక్కనబెట్టింది.

నిజానికి 2020 సెప్టెంబరు నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అది వీలు కాలేదు...

టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఎనిమిది వేదికలను షార్ట్ లిస్టు చేసింది బీసీసీఐ. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, మొహాలి, ధర్మశాల, కోల్కత్తా, ముంబై నగరాలు వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?