దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ కార్లు ఇవే..
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏవో తెలుసా, వీటిని నవంబర్‌లో భారతీయ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. మీరు కూడా పండుగ సీజన్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ కారు కొనలో, మార్కెట్లో ఏది బెస్ట్, ఎక్కువగా సేల్స్ అయిన కార్లు ఏవి ఈ సమాచారంతో మీరే నిర్ణయించుకోవచ్చు..?
మారుతి సుజుకి స్విఫ్ట్: నవంబర్ 2020లో భారత మార్కెట్లో 18,498 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 19,314 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 4 శాతం తగ్గాయి.
మారుతి నెక్సా బాలెనో: నవంబర్ 2020లో 17,872 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 18,047 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 1 శాతం తగ్గాయి.
మారుతి వాగన్ఆర్: నవంబర్ 2020లో వినియోగదారులు 16,256 యూనిట్లను కొనుగోలు చేశారు. గత ఏడాది 2019 నవంబర్‌లో 14,650 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 11 శాతం తగ్గాయి.
మారుతి ఆల్టో: నవంబర్ 2020లో వినియోగదారులు 15,321 యూనిట్లను కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 15,086 యూనిట్లను విక్రయించగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 2 శాతం పెరిగాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్: నవంబర్ 2020లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 13,536 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 17,659 యూనిట్లను విక్రయించగ, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 23 శాతం తగ్గాయి.
హ్యుందాయ్ క్రెటా: నవంబర్ 2020లో 12,017 యూనిట్ల క్రెటాను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 6,684 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 80 శాతం పెరిగాయి.
మారుతి ఈకో: నవంబర్ 2020లో మారుతి ఈకో 11,183 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. 2019 నవంబర్‌లో 10,162 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 10 శాతం పెరిగాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 / నిఓస్: హ్యుందాయ్ 2020 నవంబర్‌లో గ్రాండ్ ఐ10ని 10,936 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్‌లో 10,186 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 7 శాతం పెరిగాయి.
మారుతి బ్రెజ్జా : నవంబర్ 2020లో మారుతి బ్రెజ్జా 9,557 యూనిట్లను భారతీయ వినియోగదారులు కొనుగోలు చేశారు. నవంబర్ 2019లో 7,537 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు 27 శాతం పెరిగాయి.