కారులో కరోనా వైరస్ ని ఎలా నివారించాలి..? జాగ్రత్త డోర్లు మూసివేస్తేనే ప్రమాదం మరింత అత్యధికం..

First Published Jan 23, 2021, 11:06 AM IST

గత ఏడాది 2020 సంవత్సరంలో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి  ప్రమాదం పొంచి ఉన్న వివిధ ప్రదేశాలను అధ్యయనం చేశారు, కాని రోజువారీ జీవితంలో భాగమైన కారు గురించి తక్కువ పరిశోధనలు జరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కారు పరిమాణం చిన్నగా ఉన్నందున భౌతిక దూరం అనుసరించడం దాదాపు అసాధ్యం. ఇటువంటి సందర్భాల్లో, చిన్న ఏరోసోల్ కణాలు లేదా ఏరోసోల్స్ (శ్వాస లేదా మాట్లాడేటప్పుడు చిన్న కణాలు నోటి నుండి బయటకు వస్తాయి) కరోనా సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైరస్ నివారించడానికి కారు నడుపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.