కొత్తగా ఉద్యోగంలో చేరారా..నెలకు రూ. 10 వేలు మీవి కాదు అనుకుంటే..మీ 40వ ఏట 1 కోటి రూపాయలు మీ సొంతం..ఎలాగంటే
How to Become a Crorepati : కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ మీకు 40 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయలు జమ చేయవచ్చు. అది కూడా నెలకు కేవలం 10000 మాత్రమే జమ చేయడం ద్వారా ఇది మీరు సాధించవచ్చు. దీనికి సంబంధించిన టెక్నిక్ ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్తగా ఉద్యోగంలో చేరారా మీ వయసు 21 సంవత్సరాలు మాత్రమే ఉందా.. అయితే నెలకు కేవలం పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు 40 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయలను జమ చేయవచ్చు. అదేంటి అలా ఎలా అని ఆలోచిస్తున్నారా. కేవలం 20 సంవత్సరాల వ్యవధిలో నెలకు 10,000 జమ చేస్తే 24 లక్షల రూపాయలు మాత్రమే జమ అవుతాయి కదా అని ఆలోచిస్తున్నారా. ఒకవేళ దానికి వడ్డీ కలుపుకున్న మహా అయితే 30 లక్షలు 40 లక్షలు అవుతాయి కానీ కోటి రూపాయలు అవుతాయా అని ఆలోచించవచ్చు.
కానీ ఓ క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు 40 సంవత్సరాలు వచ్చేనాటికి ఒక కోటి రూపాయల సంపద సృష్టించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 25 సంవత్సరాలలోపు ఉద్యోగంలో చేరారు అనుకుందాం. అప్పుడు మీ వేతనం సుమారు 30 వేల రూపాయలు అనుకుందాం. అందులో పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించండి. నిజానికి మీకు వచ్చే 30 వేల రూపాయల జీతం లో పదివేల రూపాయలు అనేది కాస్త భారమే అనుకోవచ్చు. కానీ మీ వయసు 30 సంవత్సరాలు వచ్చే నాటికి అంటే పది సంవత్సరాల తర్వాత మీ వేతనం కూడా పెరుగుతుంది. అప్పుడు మీకు వచ్చిన వేతనంలో పదివేల రూపాయలు అనేవి పెద్ద భారం కాకపోవచ్చు. ఇక మీకు 40 సంవత్సరాలు వచ్చే నాటికి మీ వేతనం మరింత పెరుగుతుంది. అప్పుడు కూడా మీకు పదివేల రూపాయలు అనేది పెద్దగా భారం అనిపించవు.
ఈ లెక్కన మీరు ఈజీగా 20 సంవత్సరాల్లో పదివేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోయినట్లయితే ఒక కోటి రూపాయలను ఈజీగా పొందవచ్చు. ఎందుకు సంబంధించిన ఆర్థిక ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా, సాంప్రదాయ బ్యాంకింగ్ సిస్టంలో కన్నా కూడా ఎక్కువ రాబడి పొందవచ్చు. అంతేకాదు మీరు పెట్టిన పెట్టుబడి పై సుమారు నాలుగింతలు లాభం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సంబంధించిన పూర్తి లెక్కలను మనం తెలుసుకుందాం. నెలకు పదివేల రూపాయలు చొప్పున 240 నెలలు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం 24,00,000 రూపాయలు అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ పై సుమారు 12 శాతం రాబడి ఆశించినా 75,91,000 రూపాయలు మీకు లభిస్తాయి.
ఈ లెక్కన చూస్తే 24,00,000 + 75,91,000 = 99,91,000 రూపాయలు మీ సొంతం అవుతాయి. ఈ లెక్కన చూసినట్లయితే కేవలం 20 సంవత్సరాల వ్యవధిలో మీరు కోటి రూపాయల పండుగ సృష్టించవచ్చు. దీన్నిబట్టి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చు మీరు అంచనా వేయవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి అని గమనించాలి పైన పేర్కొన్నటువంటి కచ్చితంగా వస్తుందని హామీ ఇవ్వలేము. కానీ భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఎంపిక అవుతున్నాయి.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడికున్నవి. స్టాక్ మార్కెట్ లాభనష్టాలకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావితం అవుతుంటాయి. కావున మీరు పెట్టుబడి పెట్టేముందు నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం. మీ పెట్టుబడులకు లాభనష్టాలకు ఏషియా నెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.