రూ. 12 లక్షల జీతం వచ్చినా.. పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాగో తెలుసా.?
సాధారణంగా ఏటా రూ. 12 లక్షల జీతం వచ్చే వారు కచ్చితంగా పన్ను చెల్సించాల్సి ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంత జీతం వచ్చిన పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందొచ్చని మీకు తెలుసా? ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పన్ను ఆదా చిట్కాలు
పన్ను ఆదా చేసుకోవాలంటే ఏడాది ప్రారంభం నుంచి ఆ ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎక్కువ పన్ను ఆదా చేసుకోవచ్చు. కొన్ని రకాల మార్గాలను అనుసరించి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందొచ్చు. అసలు ఆదాయపు పన్ను పూర్తిగా చెల్లించకుండా ఉండొచ్చు.
పన్ను ఆదా చిట్కాలు
పన్ను మినహాయింపు పొందాలంటే మీకు వచ్చే జీతం స్ట్రక్చర్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఉంటుందని చాలా మందికి తెలిసి ఉండదు. మీకు రీయింబర్స్ మెంట్ లో ఎంత డబ్బు కావాలి? పన్ను పరిధిలోకి వచ్చే జీతం ఎంత ఉండాలి అనే దానిని నిర్ణయించుకోవచ్చు. సాధరణంగా రీయింబర్స్ మెంట్ లో ఎంత డబ్బు కావాలి, పన్ను పరిధిలోకి వచ్చే జీతంగా ఎంత డబ్బు కావాలి అని మీరు నిర్ణయించుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌లో LTA, ఫుడ్-కూపన్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటర్నెట్ లేదా ఫోన్ బిల్లులు, పెట్రోల్ వంటివి ఉంటాయి.
పన్ను ఆదా చిట్కాలు
HRA పూర్తిగా ఉపయోగించుకోండి
పన్ను ఆదా చేసుకోవడంలో హెచ్ఆర్ఏ కూడా ఒక మార్గంగా చెప్పొచ్చు. ఇందుకోసం మూడు మార్గాలను అవలంబిస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది.
1. జీతంలో కంపెనీ ఇచ్చే HRA క్లెయిమ్ చేయవచ్చు.
2. మెట్రో నగరాల్లో బేసిక్ జీతంలో 50% వరకు, నాన్ మెట్రో నగరాల్లో బేసిక్ జీతంలో 40% వరకు HRA పొందవచ్చు.
3. మీ మొత్తం అద్దె నుంచి బేసిక్ జీతంలో 10% తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం వరకు మీరు HRA క్లెయిమ్ చేయవచ్చు.
పన్ను ఆదా చిట్కాలు
ఒకవేళ మీ వార్షిక జీతం రూ. 12 లక్షలు అయితే, HRA రూ. 3.6 లక్షలు, LTA రూ. 10,000, టెలిఫోన్ బిల్లు రూ. 6000గా జీతం స్ట్రక్చర్‌ని రూపొందించుకోవాలి. ఈ విధంగా మీరు మొత్తం జీతంలో తగ్గింపు పొందుతారు.
పన్ను ఆదా చిట్కాలు
వీటితోపాటు.. సెక్షన్ 16 కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000
ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు రూ. 2500
సెక్షన్ 10 (13A) కింద HRA రూ. 3.6 లక్షలు
సెక్షన్ 10 (5) కింద LTA రూ. 10,000
పైన పేర్కొన్న అన్ని అంశాలను కలిపితే, ఇప్పుడు మీ పన్ను పరిధిలోకి వచ్చే జీతం రూ. 7,71,500 అవుతుంది.
పన్ను ఆదా చిట్కాలు
వీటితోపాటు..
80C కింద (LIC, PF, PPF, పిల్లల చదుకుల ఖర్చులు మొదలైనవి) రూ. 1.50 లక్షలు
సెక్షన్ 80CCD కింద, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-1 కింద రూ. 50,000
80D కింద, స్వయం, భార్య, పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ. 25,000
తల్లిదండ్రులకు (సీనియర్ సిటిజన్స్) హెల్త్ పాలసీలో తగ్గింపు రూ. 50,000
ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే జీతం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే జీతం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 87A కింద రిబేట్, బేసిక్ మినహాయింపు లభిస్తుంది. ఈ విధంగా మీ పన్ను సున్నా అవుతుంది. ఈ ట్రిక్ పాత పన్ను విధానంలో పనిచేస్తుందని గుర్తుంచుకోండి.