Business Ideas: గ్రామీణ యువత కేవలం రూ. 50 వేల పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదన సొంతం చేసుకునే చాన్స్..
నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురుచూసి సమయం వృధా చేస్తున్నారా. అయితే ఇక ఏ మాత్రం సమయం వృధా చేయకండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాల ద్వారా రుణం పొంది మంచి వ్యాపారం ప్రారంభించడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.
మీరు గ్రామంలో ఉండి సొంత వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఆర్గానిక్ కోళ్ల ఫారం ప్రారంభించవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలంటే, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు, మార్కెట్లో ఉన్నటువంటి పౌల్ట్రీ సంస్థల నుంచి ఫ్రాంచైజీ సైతం పొందాల్సి ఉంటుంది.
అయితే మీరు సొంతంగానే నాటు కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ వద్ద అర ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఓపెన్ పద్ధతిలో నాటు కోళ్ల ఫారం ను ఏర్పాటు చేసుకోవచ్చు. మామిడి తోట, జామ తోట వంటి తోటలు ఉన్నట్లయితే, అందులో అదనపు ఆదాయం వచ్చేందుకు నాటు కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకోవచ్చు.
సాంప్రదాయంగా బ్రాయిలర్ కోళ్ల ఫారం లో పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి కోళ్లను బంధించి వాటికి ఫీడింగ్ పెట్టి, కోళ్లను బరువు పెరిగేలా పెంచుతారు. మంచి బరువు అందుకోగానే వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. అయితే సాంప్రదాయ నాటు కోళ్ల ఫారంలో మాత్రం నాటు కోళ్లను ఓపెన్ పద్ధతిలోనే పెంచవచ్చు. ఈ పద్ధతిలో ఖర్చు చాలా తక్కువ దాణా కూడా ఎక్కువగా ఖర్చు అవ్వదు. మీరు కూడా ఈ పద్ధతిలో పెంచాలి. అనుకున్నట్లయితే, కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటే మంచిది.
నాటు కోళ్ల ఫారం కోసం ఓపెన్ పద్ధతిలో అర ఎకరం భూమిలో ఒక చిన్న షెడ్డు నిర్మించుకుంటే సరిపోతుంది. రైతుల వద్ద నుంచి నాటుకోడి గుడ్లను సేకరించి, వాటిని ఇంక్యుబేటర్లో పిల్లలుగా పొదిగిన అనంతరం ఓపెన్ గా పెంచవచ్చు. ఈ పద్ధతిలో దాణా ఎక్కువగా వేస్ట్ అవదు. అంతేకాదు బ్రాయిలర్ కోళ్ల ఫారంలో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ నాటు కోళ్ల ఫారంలో ఎలాంటి రసాయనాల వాడకం ఉండదు. కావున మీకు ఖర్చు కూడా తగ్గుతుంది.
ఓపెన్ పద్ధతిలో అర ఎకరం వ్యవసాయ భూమిలో కోళ్లను పెంచవచ్చు. తోటలో విహరిస్తూ ఓపెన్ పద్ధతిలో కోళ్లు పెరుగుతాయి. ఈ తరహా పెంపకంలో కోళ్లకు జబ్బులు కూడా ఎక్కువగా రావు. తోటలో లభించే పురుగులు ఇతర పోషకాలను కోళ్లు సేకరించి అవకాశం ఉంటుంది తద్వారా మీకు ఖర్చు కూడా తగ్గుతుంది.
ముఖ్యంగా నాటు కోళ్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తుంది మీరు నాటు కోళ్లను నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే నాటు కోళ్ల పెట్టుబడికి సుమారు 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో షెడ్డు, ఇంక్యుబేటర్, మీ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఫెన్సింగ్ వంటివి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం వ్యవసాయ నిపుణుల వద్ద సలహా తీసుకుంటే మంచిది.