MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. ఈ రాష్ట్రాల్లో రేట్లు తెలుసుకోండి..

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. ఈ రాష్ట్రాల్లో రేట్లు తెలుసుకోండి..

నేడు జనవరి 11, గురువారం అన్ని ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఫ్యూయల్ రిటైలర్ల నుండి తాజా ధరల అప్ డేట్ ప్రకారం, దేశంలోని  ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 11 2024, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 గత ఏడాదికి మే 21, 2022న  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి స్థిరత్వాన్ని కొనసాగించారు. 

నగరాల వారీగా ధరలు

ముంబైలో  పెట్రోలు ధర ప్రస్తుతం లీటరుకు రూ . 106.31గా ఉంది కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.27గా ఉంది.

ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి .

చెన్నైలో  పెట్రోల్   ధర రూ. 102.86/లీటర్, డీజిల్ ధర రూ. 94.46/లీటర్‌గా ఉంది. 

 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03/లీటర్, డీజిల్ ధర రూ. 92.76/లీటర్.
 

25

క్రూడాయిల్ ధరలు

గురువారం వాణిజ్య సమయంలో, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 20 సెంట్లు లేదా 0.28 శాతం పెరిగి, 0202 GMT నాటికి బ్యారెల్‌కు US డాలర్ 71.57కి చేరుకుంది.  బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కూడా 21 సెంట్లు పెరిగి 0.27 శాతం  బ్యారెల్‌కు US డాలర్ 77.01 వద్ద ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్ 35 పైసలు, డీజిల్ 34 పైసలు తగ్గింది. బీహార్‌లో పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 27 పైసలు తగ్గాయి. జార్ఖండ్‌లో పెట్రోల్, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. మహారాష్ట్రలోనూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ 52 పైసలు, డీజిల్ 46 పైసలు తగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ ధర 44 పైసలు, డీజిల్ ధర 41 పైసలు తగ్గింది. అంతే కాకుండా, హిమాచల్ ప్రదేశ్ అండ్  హర్యానాలో కూడా నేడు పెట్రోల్  డీజిల్ ధరలు తగ్గాయి.
 

35

నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.59, డీజిల్ ధర రూ.89.76గా ఉన్నాయి.

 ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర  లీటరుకు రూ.89.75కి చేరింది.

 లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

 పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54, డీజిల్ ధర రూ.94.32గా ఉంది.

 పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82. 
 

45

 వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు ఇంకా  స్థానిక పన్నులు వంటి విభిన్న కారకాల కారణంగా రాష్ట్రాలలో పెట్రోల్  డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ఈ హెచ్చుతగ్గులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) కార్యకలాపాల ద్వారా ప్రభావితమవుతాయి. ఈ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా  ధరలను క్రమం తప్పకుండా సర్దుబాటు చేస్తాయి, ఇంకా ప్రతిరోజూ వాటిని అప్ డేట్ చేస్తాయి.
 

55

పెట్రోల్ ధరలను ఎలా చెక్  చేయాలి?

మీరు మీ ఇంటిలో నుండి  కూడా పెట్రోల్ డీజిల్ ధరలను చెక్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ నుండి మీ సిటీ కోడ్‌తో 9224992249కి మెసేజ్ పంపండి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో సిటీ కోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved