పది పక్కన 34 సున్నాలు పెడితే ఎంత? నిర్మలా సీతారామన్ కూడా చెప్పలేరేమో?
ఒకటి పక్కన సున్నా పెడితే ఎంత అంటే 10 (పది), రెండు సున్నాలు పెడితే 100 (వంద), మూడు సున్నాలు పెడితే 1000 (వెయ్యి), నాలుగు పెడితే 10,000 (పది వేలు), ఐదు సున్నాలు పెడితే 1,00,000 (లక్ష) అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. ఆరు సున్నాలు పెడితే ఎంత అంటే.. అది కూడా తెలియదా 10,00,000 (పది లక్షలు) అంటారు. మరి 10 పక్కన 10 సున్నాలు పెడితే, 10 పక్కన 20 సున్నాలు పెడితే, 10 పక్కన 34 సున్నాలు పెడితే ఎంత? మీకు తెలుసా?
numbers
ఇంగ్లీష్‌లో నంబర్లు చెప్పాలంటే వన్ నుంచి మొదలై టెన్, హండ్రెడ్... మిలియన్, బిలియన్, ట్రిలియన్ వరకు చెబుతారు. మరి ఆ తర్వాత చెప్పాలంటే.. 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, వెయ్యి ట్రిలియన్లు అంటారు. ఇక తెలుగులో అయితే, ఒకటి, పది, వంద, వెయ్యి.... లక్ష, కోటి.. మరి ఆ తర్వాత ఏంటి..? పది కోట్లు, వంద కోట్లు, వెయ్యి కోట్లు... ఇంత వరకు ఓకే. మరి ఆ తర్వాత లక్ష కోట్లు, పది లక్షల కోట్లు... అంటారా..? కానే కాదు, తెలుగులో లక్ష కోట్లు, పది లక్షలు కోట్లు, ఆపై సంఖ్యకు కూడా నిర్దిష్టమైన పదం ఉంది తెలుసా. 10 పక్కన 20 సున్నాలు పెడితే ఎంత అంటే ఇప్పటివారు చెప్పలేకపోవచ్చు. 10 పక్కన 30 సున్నాలు పెడితే ఏమవుతుందంటే తెల్లముఖం వేయొచ్చు. ఈ నంబర్‌ను ఏమంటారంటే సాక్షాత్తూ దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమాధానం చెబుతారో లేదో తెలియదు.
న్యర్బుదం, ఖర్వం
టకటకా నంబర్లు చెప్పమంటే.. ఒకటి కోటి వరకు చెప్పగలం. ఆ తర్వాత పది కోట్లు, వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు అంటాం. లక్ష కోట్లకు తెలుగులో ఒక పదం ఉంది. అదే న్యర్బుదం. ఇక, పది లక్షలను కోట్లను ఖర్వం అంటారు.
మహా ఖర్వం నుంచి క్షోభం వరకు...
ఇక, 10 పక్కన 13 సున్నాలు పెడితే మహా ఖర్వం అంటారు. 10 పక్కన 14 సున్నాలుంటే పద్మం, 15 సున్నాలుంటే మహా పద్మం అంటారు. 10 పక్కన 16 సున్నాలుంటే క్షోణి, 17 సున్నాలుంటే మహో క్షోణి, 18 సున్నాలుంటే శంకం, 19 సున్నాలుంటే మహా శంఖం, 20 సున్నాలుంటే క్షితి, 21 సున్నాలుంటే మహా క్షితి, 22 సున్నాలుంటే క్షోభం అంటారు.
మహా క్షోభం, మహా భూరి అంటే ఏమిటి?
ఆ తర్వాత 10 పక్కనే 23 సున్నాలుంటే మహా క్షోభం అంటారు. 24 సున్నాలుంటే నిధి, 25 సున్నాలుంటే మహా నిధి.... ఇలా 10 పక్కన 30 సున్నాలుంటే అవ్యాయం, 31 సున్నాలుంటే అమృతం, 32 సున్నాలుంటే అచింత్యం, 33 సున్నాలంటు అమేయం అంటారు. ఇక, 10 పక్కన 34 సున్నాలుంటే భూరి, 35 సున్నాలుంటే మహాభూరి అంటారు.