రైతుల కోసం భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ హైబ్రిడ్ ట్రాక్టర్.. ఇంధనాన్ని కూడా 50% ఆదా చేస్తుంది..
ప్రోక్సెక్టో దేశంలో మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ హైబ్రిడ్ ట్రాక్టర్ హెచ్‌ఏవి ఎస్1 ను విడుదల చేసింది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ట్రాక్టర్ లో ఎటువంటి బ్యాటరీని ఉపయోగించలేదు. ఈ హైబ్రిడ్ ట్రాక్టర్‌లో రెండు డజన్లకు పైగా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.
అయితే ఈ విభాగంలో ఒక వాహనంలో ఇలాంటి ఫీచర్లు ఇవ్వడం మొదటిసారి. ఈ ట్రాక్టర్ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు, టెక్నాలజీతో వస్తుంది, కాబట్టి కంపెనీ దీనిని భారతదేశపు అత్యంత వినూత్నమైన ట్రాక్టర్ గా భావిస్తుంది.
ప్రపంచవ్యాప్త ప్రశంసలు
హెచ్‌ఏవి ట్రాక్టర్‌ను 2019 నవంబర్ జర్మనీ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రోటెక్నిక్ కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. ఈ ట్రాక్టర్ గురించి భారత మార్కెట్లో కూడా చర్చించబడుతోంది ఎందుకంటే ఇది బ్యాటరీ ప్యాక్ లేని మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా హైబ్రిడ్ ట్రాక్టర్. దీని ఆధునిక పర్యావరణ ఫ్రెండ్లీ టెక్నాలజికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు హెచ్‌ఏవి ఎస్ 1 సిరీస్ ట్రాక్టర్ ఎట్టకేలకు భారతీయ రైతుల ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది.
ఈ ట్రాక్టర్ లాంచ్ సందర్భంగా ప్రోక్సెక్టో ఇంజనీరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెచ్ఎవి ట్రాక్టర్స్ వ్యవస్థాపకుడు అంకిత్ త్యాగి మాట్లాడుతూ, "భారతదేశం, విదేశాలలోని ప్రజల నుండి మాకు చాలా మంచి స్పందన వచ్చింది. కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్, సప్లయి చైన్, లాజిస్టిక్స్, మ్యాన్ పవర్, డీలర్లు, సరఫరాదారులతో సహా అనేక రంగాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఈ ట్రాక్టర్‌ను భారతదేశంలో లాంచ్ చేయడంలో మేము విజయవంతం అయ్యాము." అని అన్నారు.
ఫ్యూచర్ రెడీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్
బ్యాటరీ ప్యాక్ ఉపయోగించని దేశంలో ఉన్న ఏకైక హైబ్రిడ్ ట్రాక్టర్ ఇది. ఈ ట్రాక్టర్ వేర్వేరు ఇంధన ఆప్షన్స్ పై నడుస్తుంది. మౌలిక సదుపాయాల మెరుగుదలతో ఈ ట్రాక్టర్‌ను పూర్తి ఎలక్ట్రిక్ వాహనానికి అప్‌గ్రేడ్ చేయవచ్చాని కంపెనీ తెలిపింది.
ఫుల్ ఆటోమేటిక్
ఈ ట్రాక్టర్ ఫుల్ ఆటోమేటిక్ అండ్ ఆల్ వీల్ ఎలక్ట్రిక్ డ్రైవ్ టెక్నాలజీ (AWED)ను పొందుతుంది. గేర్, క్లచ్ లేని దేశంలోని ఏకైక ట్రాక్టర్ ఇది, అయితే దీనిలో ఫార్వర్డ్, న్యూట్రల్ అండ్ రివర్స్ అనే మూడు సింపుల్ డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. రైతులు ఎక్కువ శ్రమ లేకుండా పొలాల్లో సులభంగా నడపగలుగుతారు.
ఏకొ ఫ్రెండ్లీ
హెచ్‌ఏవి ట్రాక్టర్స్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో 50ఎస్1 మోడల్ డీజిల్ హైబ్రిడ్ ఇంకా 50ఎస్2 సిఎన్జి హైబ్రిడ్. సాధారణ ట్రాక్టర్‌తో పోలిస్తే ఎస్1 మోడల్ 28 శాతం ఇంధనం ఆదా చేస్తుందని, ఎస్2 మోడల్ 50 శాతం ఇంధనం ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది.
టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ
సంస్థ ప్రకారం ఈ ట్రాక్టర్ మాక్సిమమ్ కవర్ స్టీరింగ్ (MCS)తో బలాన్ని ఉపయోగించకుండా ఈజీ స్టీరింగ్ వ్యవస్థ లభిస్తుంది. ఈ ట్రాక్టర్ టర్నింగ్ రేడియస్ కేవలం 2.7 మీటర్లు (ఫ్రంట్-స్టీర్, ఆల్-స్టీర్, క్రాబ్-స్టీర్), ఇది చాలా తక్కువ. ట్రాక్టర్లలో ఎత్తును అడ్జస్ట్ కోసం వీల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఫీచర్ ద్వారా, ఎత్తుకు అనుగుణంగా చక్రాలను అడ్జస్ట్ చేయడానికి సహాయపడుతుంది.
లేటెస్ట్ ఫీచర్లు
హెచ్‌ఏవి ట్రాక్టర్స్ సిరీస్ చాలా వినూత్నడిజైన్ తో పాటు అధునాతన ఫీచర్స్ అందిస్తుంది. దీనికి ఇంటరాక్టివ్ స్టీరింగ్ మౌంటెడ్ హెచ్‌ఎంఐ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది ట్రాక్టర్ కంట్రోల్ చేయడానికి సులభతరం చేస్తుంది. ఈ ట్రాక్‌ట్రాక్‌తో కంపెనీ 10 సంవత్సరాల లిమిటెడ్ వారంటీని అందిస్తోంది.
ధర ఎంత
హెచ్‌ఏవి ట్రాక్టర్ బేస్ మోడల్ హెచ్‌ఏవిఎస్1 50HP ధర రూ .9.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ఎస్ 1 ప్లస్ ధర రూ .11.99 లక్షలు. కంపెనీ మరో కొత్త మోడల్ ఎస్ 1 45 హెచ్‌పిని కూడా విడుదల చేసింది, దీని ధర రూ .8.49 లక్షలు. ఈ ట్రాక్టర్లను రూ .10,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.