కలలో ఎత్తు నుంచి పడితే ఏమవుతుంది?
మనకు రోజూ ఏదో ఒక రకమైన కల పడుతుంటుంది. జ్యోతిష్యం ప్రకారం.. మనకు పడే ప్రతి కల మనకు ఎన్నో సంకేతాలను ఇస్తుంది. మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్తుంది. మరి కలలో పై నుంచి కింద పడిపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజూ మనకు రకరకాల కలలు పడుతూనే ఉంటాయి. కొంతమంది ఈ కలలను పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం ఒక కల పడితే ఏం జరుగుతుందో అని బాగా ఆలోచిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్తుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తికి పడే కలలు అతని భవిష్యత్తు గురించి కొన్ని ఆధారాలను ఇస్తాయి. ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడుతున్నట్టు కలలు కంటుంటారు. అసలు ఇలాంటి కలలు పడితే ఏం జరుగుతుంది? దీని గురించి డ్రీమ్ సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
శుభమా? అశుభమా?
మీరు కలలో పై నుంచి కింద జారిపడిపోయినట్టు కలలు కంటే మంచిది కాదు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇది మంచి కలగా పరిగణించబడదు. ఈ కల అర్థం మీ ఫ్రెండ్ లేదా బంధువు మీకు ద్రోహం చేయొచ్చు. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఆకాశం నుంచి కింద పడటం అంటే అర్థం
ఇది కొంచెం వింతగానే అనిపిస్తుంది. కానీ కొంతమంది ఆకాశం నుంచి కూడా కింద పడ్డట్టు కలలు కంటుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఈ కలను కూడా అశుభంగా భావిస్తారు. ఈ కల పడితే మీ జీవితంలో అనుకోని చెడు ఘటనలు జరగొచ్చని అర్థం. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
పర్వతం నుంచి పడిపోయినట్టు
మీరు నిద్రపోతున్నప్పుడు పర్వతం నుంచి కింద పడుతున్నట్టు కలలు కంటే కూడా మంచిది కాదు. దీన్ని దురదృష్టకరమైన కలగా పరిగణిస్తారు. ఇలాంటి కల పడితే మీరు భవిష్యత్తులో సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని డ్రీమ్ సైన్స్ వెల్లడిస్తోంది.
పైకప్పుపై నుంచి పడిపోయినట్టు
చాలా మందికి ఇంటి పై కప్పు నుంచి కింద పడిపోయినట్టు కూడా కలలు కంటుంటారు. కానీ ఇలాంటి కలలు పడితే భవిష్యత్తులో కుటుంబ కలహాలు తలెత్తుతాయని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఇలాంటి కలలు పడ్డప్పుడు మీరు మీ కుటుంబంలో సామరస్యం తీసుకురావడానికి ప్రయత్నించాలి.