వృశ్చిక రాశి వారితో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఏ టైమ్ లో అయినా సెక్స్ ని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. తాము ఎప్పుడూ యంగ్ అని ఫీలౌతూ ఉంటారు. తమ ప్రేమను భాగస్వామికి పంచడంలో ఎప్పుడూ ముందుంటారు.
scorpio
ఒక్కో మనిషికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఇక శృంగారం విషయానికి వస్తే.. ఎవరు ఎలాంటి సెక్స్ కోరుకుంటున్నారో ఊహించడం కష్టమే. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం చెప్పేయవచ్చట. మరి సెక్స్ విషయంలో వృశ్చిక రాశివారు ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా వృశ్చిక రాశివారు చాలా పాషన్ గా ఉంటారు. వీరిలో ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువ. ఇక మనసులోని మర్మాలను తొందరగా బయటపెట్టరు. ఈ రాశివారు కాస్త ఎమోషనల్ గా ఉంటారు. పడక గదిలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫాంటసీలు కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి.
వృశ్చిక రాశివారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు. వేళాపాళ అంటూ ఏమీ ఉండదు. ఏ టైమ్ లో అయినా సెక్స్ ని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. తాము ఎప్పుడూ యంగ్ అని ఫీలౌతూ ఉంటారు. తమ ప్రేమను భాగస్వామికి పంచడంలో ఎప్పుడూ ముందుంటారు.
sex
ఈ రాశివారు తమను ఇష్టపడేవారిని బాగా అర్థం చేసుకుంటారు. పడక గదిలో తమ పార్ట్ నర్ కి ఏం కావాలనే విషయం వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సులభంగా తెలుసుకోగలరు. ఇక తమకు ఎవరైనా సెక్స్ కోసం ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు పంపినా వీరు వెంటనే పసిగట్టగలరు.
sexual relation
ఈ రాశివారికి సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. అయితే అపరిచితులతో మాత్రం సెక్స్ చేయడానికి వీరు పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. తెలిసినవారు.. నమ్మిన వారితో మాత్రమే కలయికలో పాల్గొంటారు.
ఇక ఈ రాశివారు సెక్స్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి కలయికను ఇష్టపడరు. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు.
Sex in fashion
పార్ట్ నర్ పడక గదిలో.. విభిన్న పొజిషన్స్ లో కలయికను ఆస్వాదించాలని అనుకుంటారు. ప్రయోగాలంటే వీరికి చాలా ఇష్టం. ఈ విషయంలో వీరికి చాలా ఫాంటసీలు కూడా ఉంటాయి. వారికి తగిన ఆలోచనలు కలిగిన వారు వస్తే.. వీరు ఇంకా ఎక్కువగా కలయికను ఆస్వాదించగలుగుతారు.
Sex in fashion
ఇక వీరు శృంగారం విషయంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. చాలా ప్రిపేర్డ్ గా ఉంటారు. సమయం దొరకడమే ఆలస్యం.. ఇలా అల్లుకుపోతుంటారు. అయితే.. తమలాగే తమ పార్ట్ నర్ కూడా ఉండాలని కోరుకుంటారు. వాళ్లు కూడా తమలా లేకపోతే.. వీరు కొంచెం ఇబ్బందిపడతారు.