ఫిబ్రవరి నెల రాశిఫలాలు
ఫిబ్రవరి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్పర్ధలు తొలగును. భాగస్వామ్య వ్యాపారములు ఈ మాసంలో కలసి వస్తాయి. వ్యాపారులకు ధనాదాయం పెరుగును. రుణాలు తీర్చగులుగుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గంథ్రాల ప్రాకారం.. ఏ రాశి వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే.. వారి లైంగిక జీవితం బాగుంటుందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట. ఎందుకంటే ప్రతి రాశిచక్రం దాని స్వంత లక్షణాలు, ఇష్టాలు మరియు అయిష్టాలను కలిగి ఉంటుంది, ఇవి ఇతరులకు భిన్నంగా ఉంటాయి. రాశిచక్రం ప్రకారం ఏ సెక్స్ స్థానాలు జీవిత ఆనందాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో సమస్యలు తగ్గును. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహం లభించును. ఉన్నత మార్పును ఈ మాసంలో ఆశించవచ్చు. వైవాహిక జీవన సమస్యలు కూడా తగ్గును. విదేశీ జీవనమును కోరుకుంటున్న వారికి శుభ ఫలితాలు. కుటుంబ అనారోగ్యత తగ్గుముఖం పట్టును. చేజారిన వివాహ సంబంధాలు తిరిగి వచ్చుటకు సూచనలు అధికం. ఈ మాసంలో సువర్ణ సంబంధ కొనుగోలు, పెట్టుబడులు లాభించును. 11 వ తేదీ నుండి 22 తేదీలు గత కాలంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుటకు అనుకూలమైనవి. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడానికి , బంధుత్వాలను తిరిగి కలుపుకోవడానికి ఈ మాసం మంచి కాలం. 25, 26, 27, 28 తేదీలలో కాంట్రాక్టు పనులు చేయు వారికి, వడ్డీ వ్యాపారం చేయువారికి మంచి ధన లాభములు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్పర్ధలు తొలగును. భాగస్వామ్య వ్యాపారములు ఈ మాసంలో కలసి వస్తాయి. వ్యాపారులకు ధనాదాయం పెరుగును. రుణాలు తీర్చగులుగుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులు లేవు. ప్రయాణాలు చేయుట వలన మానసికంగా ప్రశాంతత లభించును. నూతన ప్రణాళికలు రచించుకొందురు. కొత్త సంబంధాలు ఏర్పడును. బంధు వర్గానికి సహాయం చేసెదరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ విషయాలలో ప్రశాంతత ఏర్పడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టు వ్యవహారలందు వేగం పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం వలన లాభం ఏర్పడుతుంది. గృహమార్పిడి ప్రయత్నాలు ఫలించును. 11 నుండి 15 వ తేదీ మధ్యకాలంలో విలువైన పత్రాలు, ఆభరణాల పట్ల జాగ్రత్త అవసరం. తృతియ వారంలో నూతన అవకాశములు లభించును. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గును. జీవిత భాగస్వామి సలహాలు పనిచేస్తాయి. మాసాంతానికి తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఆశించిన పనులు కార్యరూపం దాల్చును. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉన్నత వర్గీయుల పరిచయాలు ఏర్పడుతాయి. సంతనలేమి దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి అననుకుల ఫలితాలు. జీవిత భాగస్వామితో చికాకులు. ధనాదాయం బాగుండును. పెద్దవయస్సు వారికి కుడి నేత్ర సంబంధ సమస్యలు బాధించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో విరివిగా ప్రయాణాలు ఏర్పడును. ప్రయత్నపుర్వక కార్య లాభాలు ఏర్పడును. గాడి తప్పిన ఆర్ధిక విషయాలు క్రమంగా దారిలోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ప్రోత్సాహక కాలం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇబ్బందుల నుండి బయటపడతారు. శత్రు విజయం ఏర్పడుతుంది. గృహంలో శుభ పరిణామాలు ఉన్నాయి. గొప్ప స్థాయి వ్యక్తుల ద్వారా లాభపడతారు. మాసాంతంలో సంతానం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో 4, 5, 6 తేదీలు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. నూతన ఆలోచనలను తిరిగి కార్యాచరణలో పెట్టాలని చూస్తారు. కోర్టు లావాదేవీలు, మిత్ర వర్గ తగాదాలు పరిష్కారం పొందుతాయి. దైవ కార్యములందు ఆసక్తి ఏర్పడును. వ్యాపార విస్తరణ పనులు పూర్తిచెయగలరు. పెట్టుబడులు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తగుట వలన ఒత్తడి తగ్గుతుంది. దాంపత్య సుఖం పొందుతారు. కుటుంబ అంతర్గత సమస్యలను వివేకంతో పరిష్కరిస్తారు. స్వ ఆరోగ్య విషయాలలో ఉదర సంబంధ సమస్యలు చికాకులు కలిగించు సూచన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ఒక శస్త్రచికిత్స ఏర్పడును. ప్రధమ అర్ధ భాగంలో గృహంలో చొరభయం. ఉద్యోగ జీవనంలో కార్యభారం పెరుగుట. దూరప్రాంత ప్రయాణములు అనుకూలంగా ఉండవు. ప్రేమ వ్యవహారాలలో మనోవేదన. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యం. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు అన్వేషిస్తారు. ఎదిగిన పుత్ర సంతనముతో కొద్దిపాటి అభిప్రాయ బేధాలు ఏర్పడును. ఉద్యోగ జీవన ఫలితాలు సామాన్యం. ఈ మాసంలో 1, 3, 4, 16, 27 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో చక్కటి ఆదాయమునకు సూచనలు కలవు. కెరీర్ పరంగా ఉన్నతి పొందుతారు. పెద్ద వయస్సు వారికి శరీర అరోగ్యం సహకరించదు. గత కాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. పశు సంబంధ హాని. 14, 15, 16, 17 తేదీలలో కార్యానుకులత ఏర్పడును. ప్రభుత్వ రంగ ఉద్యోగం చేయువారికి వారికి చాలా అనుకూలమైన కాలం. గృహంలో మార్పులు చేయుటకు ఇది మంచి సమయం. 26, 27, 28, 29 తేదీలలో చేయు దూరప్రాంత నివాస ప్రయత్నములు లాభించును. ఆలోచనలు సక్రమ మార్గంలో ఉంటాయి. అభివృద్ధికర జీవనం ఏర్పడుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో ధనసంబంధమైన చికాకులు భాదించును. వృధా వ్యయం చేయకండి. ప్రధమ ద్వితీయ వారములలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్యవిజయం. విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. పెద్దలకు వైరాగ్య భావన ఏర్పడగలదు. తృతీయ వారంలో కొంత ఒత్తిడి తగ్గును. సంతాన సంబంధ సుఖ సంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు / ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసిడి ప్రయత్నాలు సఫలము అగును. ఈ మాసంలో 17 నుండి 23వ తేదీ మధ్య చేయు వివాహ ప్రయత్నములు విజయవంతం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అంతగా అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత ఆరోగ్యంలో జ్వరతత్వం వలన బాధలు ఏర్పడును. కష్టంతో పనులు పుర్తిచేయగలుగుతారు. గత కాలంలో దాచుకున్న ధనము కొంత వ్యయం అగును. 16వ తేదీ నుండి నుండి ఆందోళనకర పరిస్థితలు అధికం అగును. ప్రభుత్వ అధికారుల వలన తీవ్ర ఆటంకములు. చివరి వారానికి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండగలదు. ప్రతీ వ్యవహారంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధ ప్రయత్నాలలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో ప్రారంభ రోజులలో ద్రవ్య లాభం పొందుతారు. బంధు వర్గం వలన సహకారం పొంది నూతన స్తిరాస్తులను ఏర్పాటు చేసుకొంటారు. వృత్తి జీవనంలోని వారికి గౌరవం, చక్కటి అభివృధ్హి ఏర్పడును. విదేశీ జీవనం చేయువార్కి ఈ మాసం కలసిరాదు. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించుదురు. సంతానంతో విరోధములు ఏర్పడును. శతభిషా నక్షత్ర స్త్రీలకు అపవాదులు భాదించును. మనశ్శాంతి లోపించును. మాసాంతమునకు ప్రతీ వ్యవహారం శ్రమకరంగా ఉండును. ముఖ్యంగా 26, 27, 28 తేదీలు మంచివి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో విద్యార్ధులకు అఖండ విజయం ఏర్పడును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. ఈ మాసంలో 19, 20, 25, 26, 27 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.