MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2023లో మకర రాశివారి ఫలితాలు..!

2023లో మకర రాశివారి ఫలితాలు..!

నూతన సంవత్సరం 2023లో మకర రాశివారికి ఓ నెలలో  బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు . శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

9 Min read
Author : ramya Sridhar
Published : Dec 10 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
Here are tips for dating a Capricorn!

Here are tips for dating a Capricorn!

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
 

215
Vijaya Rama krishna

Vijaya Rama krishna

 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

315
capricorn

capricorn


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది.  . ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ నుంచి అపార్ధాలకు తావులేకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు . శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటివారిని కలుపుకొనిపోవడం ద్వారా మేలు జరుగుతుంది. నవగ్రహ సందర్శనం మంచిది.

415
Capricorn Zodiac

Capricorn Zodiac

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
 
ఈ నెలలో  ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. ఊహించని కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి. 
 
 లవ్ లైఫ్ : దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. 

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
 
 ఆరోగ్యం:  మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ఆహార,విహార విషయంలో  మెలకువ అవసరం. 
 

515

ఫిబ్రవరి 2023

ఈ నెలలో  గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అనుకున్నఫలితాలు సొంతం అవుతాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో సఫలీకృతులు అవుతారు. బంధుమిత్రులతో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సూర్య ఆరాధన మనోబలాన్ని ఇస్తుంది.

ఉద్యోగం-వ్యాపారం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఆ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీ సహోద్యుగలతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్దులకు కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. కొత్త దిసగా ఆలోచింప చేస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.


లవ్ లైఫ్:  కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో కలిసి విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్థాయి. 
  
 ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెల లో  గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ఆరోగ్యం:  సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది.సమయానికి ఆహారనియమాలను పాటించాలి.  ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది 

615

మార్చి 2023

ఈ రాశివారికి    ఈ మాసం శుభదాయకం. వివాహయత్నం ఫలిస్తుంది.  వివహ వేదికలు అన్వేషిస్తారు. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. 

లవ్ లైఫ్ :  మీ లైఫ్ పార్టనర్ తో కలిసి గృహంలో మార్పుచేర్పులు చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధు, మిత్రులు కలుస్తారు. 

ఉద్యోగం-వ్యాపారం: . వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం.  రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. 

ఆరోగ్యం:  కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. ఈ క్రమంలో దెప్పి పొడిచే  బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
 

715

ఏప్రియల్  2023

ఈ నెలలో   విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన ప్రతీ పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. ఇంట్లో శుభకార్యప్రసక్తి వస్తుంది . సమాజంలో కీర్తి పెరుగుతుంది.పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాసాంతంలో ఒక మంచివార్త వింటారు. ఇష్టదేవతను స్మరించాలి.
 
లవ్ లైఫ్ : జీవన భాగస్వామి  తో ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీకు పూర్తిగా అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.ఇష్టదేవతారాధన శుభప్రదం.

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు కలిగే సూచనలు.   ఘర్షణలు, మానసిక వేదన అధికముగా ఉండును.  గొడవలకు దూరంగా ఉండటం మంచిది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది అని తెలియచేస్తున్నాము. 

ఆరోగ్యం:మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. గ్రహ అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం  దుర్గాదేవిని పూజించాలి.  
 

 

815


మే  2023

ఈ నెల లో ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.ఇష్టదేవతారాధన శుభప్రదం.

లవ్ లైఫ్ : మీ కుటుంబ జీవితం బాగుంది.   ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును.  కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి.  కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించినా భయపడాల్సిన పనిలేదు.

ఉద్యోగం-వ్యాపారం:  గ్రహ అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసం.

ఆరోగ్యం:    కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో  శ్రద్ధ వహించడం మంచిది. మీ వరకు అనారోగ్య బాధలు ఉండవు. కుటుంబ సబ్యులకు సహకరించే అవకాశం లభిస్తుంది.  అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

915


జూన్   2023
 
ఈ నెలలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. గ్రహాల అనుకూల స్థితి వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఈ రాశివారికి ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధనమునకు సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిళ్ళు తగ్గును. శని,   అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును.  మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. 

లవ్ లైఫ్ :    స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును.  కొంత కాలము కుటుంబ వ్యవహారాలయందు, ఉద్యోగ వ్యాపారముల యందు ఓర్పుతో ఆచితూచి వ్యవహరించాలని సూచన. 

ఉద్యోగం-వ్యాపారం:  వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగును.గురు గ్రహ అనుకూల ప్రభావంచేత మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. 

ఆరోగ్యం: ఆరోగ్యం చక్కగా ఉంది. మానసికంగా ఉల్లాసముగా ఈ నెల గడుస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు సమస్యలు తెచ్చిపెడతాయి. ఆచి,తూచి అడుగువేయండి. ఆరోగ్య విషయమై అనవసర అనుమానాలతో మనశ్సాంతి కోల్పోకండి.
 

1015

జూలై   2023

ఈ నెలలో  అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మీరు  చేసే ప్రతీ పని అనుకూలించును.  అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ధనలాభము, సౌఖ్యము కలుగును. కుటుంబముతో ఆనందముగా గడి పెదరు. ఆరోగ్యము కుదుటపడును. రాజకీయ ఒత్తిళ్ళను మీ అనుభవముతో ఎదుర్కొనెదరు. నెల మధ్యలో గ్రహ సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.   మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి.  

లవ్ లైఫ్ : మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమికులకు కలిసొచ్చే కాలం. గ్రహ దోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. కుటుంబ వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

ఉద్యోగం- వ్యాపారం:   ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సంఘ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 

 ఆరోగ్యం:    పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృధ్యాప్య సమస్యలను బూతద్దంలో చూడకండి. ధైర్యమై అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని మర్చిపోవద్దు.

1115
<p>capricorn</p>

<p>capricorn</p>

ఆగస్ట్    2023

 ఈ నెల పరిస్థితులు మెరుగుపడతాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోష పరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల విక్రయంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. కుటుంబ వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

 లవ్ లైఫ్ :  బ్రహ్మచారుల కు వివాహాలు కుదిరే కాలం. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా అయినా పూర్తిగా లభిస్తాయి. భాగస్వామితో మీరు ఆనందంగా విహార యాత్రలు చేస్తారు. 

ఆరోగ్యం:    జన్మరాశి  గ్రహ సంచార ప్రభావం చేత ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. ఈ  రాశివారికి ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన సమస్యల నుంచి బయిటపడతారు.

ఉద్యోగం- వ్యాపారం:సాప్ట్ వేర్   ఆఫీస్ లు తమ టార్గెట్ లతో కొద్దిపాటి విసుగు, చిరాకు తప్పదు. పై ఉద్యోగులతో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త.   ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్దులు  ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. 

1215

సెప్టెంబర్    2023

ఈ నెలలో  ఈ  రాశి వారికి   మధ్యస్తముగా ఉంటుంది.  శని ప్రభావం ఉంటుంది కాబట్టి.. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి.  కుటుంబంలో వాదనలు, సమస్యలు ఉండే అవకాశముంది. మనస్తాపము, అనారోగ్యం వచ్చే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశముంది. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి.  ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

లవ్ లైఫ్ : గ్రహాలు కుటుంబ జీవితంపై మంచి దృష్టిని ప్రసరింప చేస్తున్నాయి. దాంతో  మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను అందుకుంటారు.ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. 

ఉద్యోగం- వ్యాపారం: అధికారులకు పనిభారం.  క్రిందవారికి నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు.ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. 

ఆరోగ్యం:    మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆనందంగా గడపటానికి ప్రయత్నించండి.  మనోనిగ్రహమే అన్నిటికి మందు. ఆహార, విహారాల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

1315

అక్టోబర్    2023

ఈ నెలలో  మీ  సంకల్పం నెరవేరుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. మీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని సైతం చేస్తారు.విలసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది.

లవ్ లైఫ్ : ఆర్ధిక విషయాలు అనుకూలించటంతో  కుటుంబములోని సమస్యలు తొలగుతాయి.  మీ భాగస్వామి ఇచ్చే ధైర్యమే మీకు పెద్ద బలం. కుటుంబపరంగానూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. 

ఉద్యోగం- వ్యాపారం:   మీ ఉద్యోగంలో ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. సినిమావారికి అనుకూల సమయం. 

ఆరోగ్యం:    గ్రహాల సంచారం బాగుండటం వలన కొత్త పరిస్థితులకు తగ్గటుగా కలిసిపోవటంవల్ల ప్రత్యేకంగా  ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు. 

1415

నవంబర్    2023

ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది.  అయినా  అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అధికారులతో సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు.  మీ శ్రీమతి సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.  కలిసిరాని గ్రహాలు అడ్డు పడటం వలన కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఎన్ని ఎలా ఉన్నా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఊరటనిస్తుంది.  ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టండి.  వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. 

లవ్ లైఫ్ : భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు ఎక్కువగా ఉండును. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు సాయం చేస్తారు. 

ఆరోగ్యం:  ఒక సమాచారం ఉతేజపరుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా పూర్తిగా సమీక్షించుకుంటారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి.  మధుమేహం ఉన్నవారికి జాగ్రత్త సూచన.

 ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు.ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికం.

1515

 డిసెంబర్    2023

ఈ నెలలో  కార్యసిద్ధి, వాహనయోగం ఉన్నాయి. మీ పిల్లలు  విజయం ఉత్సాహాన్నిస్తుంది.  వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నెల ప్రారంభంలో పనులు మందకొడిగా సాగుతాయి.  మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. . మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

లవ్ లైఫ్ : మీ భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఉన్నా...కుటుంబమే మనకు పూర్తి సపోర్ట్ ఉంటుందని గుర్తు చేసుకోండి.  కుటుంబం ఆర్దిక విషయమై టెన్షన్ లో ఉన్నప్పుడు  ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కుటుంబంలో రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం:   ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది.   గొడవలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రుల ప్రశంసలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉల్లాసంగా ఉంటేనే ఆరోగ్యం చక్కబడుతుంది.

ఉద్యోగం- వ్యాపారం :  ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. శని సంచారము వలన ఆర్ధిక సమస్యలు వస్తాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

 


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఈ 3 రాశులవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది !
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved