చంద్రబాబుకు మళ్లీ హాట్ సీటు దక్కేనా

First Published 12, Mar 2019, 12:02 PM

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సుమారు సుమారు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా పదేళ్ల పాటు చంద్రబాబునాయుడు పనిచేశారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సుమారు సుమారు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా పదేళ్ల పాటు చంద్రబాబునాయుడు పనిచేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ కూడ చంద్రబాబునాయుడు గత ఐదేళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు తొమ్మిది ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 1995 ఆగష్టు సంక్షోభంలో ఎన్టీఆర్ నుండి చంద్రబాబునాయుడు వర్గం టీడీపీని దక్కించుకొంది. దరిమిలా చంద్రబాబునాయుడు టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా కూడ చంద్రబాబు బాధ్యతలను చేపట్టారు

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 1995 సెప్టెంబర్1వ తేదీ నుండి 2004 మే 13వరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ పరాజయం పాలైంది.

ఈ రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ పాదయాత్ర కీలకంగా మారింది.

2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ కుటుంబం అంతా టీడీపీ వెంటే ఉందని ప్రజలకు నమ్మకం కల్గించే ప్రయత్నం చేశారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఖమ్మం నుండి తిరిగి వస్తున్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.

2009 ఎన్నికల్లో వామపక్షాలు, టీఆర్ఎస్‌లతో కలిసి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈ పొత్తు కూడ బాబుకు ఆ ఎన్నికల్లో కలిసిరాలేదు. వరుసగా రెండు దఫాలు వరుసగా టీడీపీ అధికారానికి దూరమైంది.

ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు మీ కోసం అంటూ రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర కూడ బాబుకు కలిసిరాలేదు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్‌ మృతి చెందాడు. వైఎస్ఆర్ మృతి చెందిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి.

తెలంగాణ ఉద్యమం ఊపందుకొంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగాడు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు సాగాయి.

వైసీపీ, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడ తెలంగాణకు అనుకూలంగా లేఖలను ఇచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకొన్నాడు.  టీడీపీకి టీఆర్ఎస్, వైసీపీల నుండి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 2009 ఎన్నికల్లో సుమారు 90 మంది ఎమ్మెల్యేలను టీడీపీ గెలుచుకొంటే 2014 ఎన్నికలకు ముందు నాటికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది టీఆర్ఎస్‌ గూటికి చేరారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడ వైసీపీలో చేరారు.

ఈ తరుణంలో చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం అంటూ అనంతపురం జిల్లా హిందూపురం నుండి పాదయాత్రను ప్రారంభించారు. రాయలసీమ, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర మీదుగా ఉత్తరాంధ్రలోని విశాఖలో చంద్రబాబునాయుడు పాదయాత్రను ముగించారు.

ఈ పాదయాత్ర ద్వారా పార్టీ క్యాడర్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు టీడీపీ నేత చంద్రబాబుకు అవకాశం దక్కింది. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అమలు చేస్తోంది.రైతు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణాల వంటి హామీలను పాదయాత్ర ద్వారానే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం సాధించింది, తెలంగాణలో టీఆర్ఎస్ నెగ్గింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయాయి. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే రోజున కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం చేశారు.

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబునాయుడు పోటీ చేశారు. ఆ సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ నిలుపుకోలేదు. దీంతో ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు.

బీజేపీయేతర కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో టీడీపీ కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్తుకు నేను భరోసా అంటూ చంద్రబాబునాయుడు బరిలోకి దిగారు. ఏపీ ప్రజలు ఈ దఫా బాబుకు మద్దతిస్తారా, జగన్‌కు జై కొడుతారా అనేది మే 23న తేలనుంది.