అచ్చం కేసీఆర్ లాగే: జగన్ పై చంద్రబాబు పంచ్ లు

First Published 11, Mar 2019, 11:55 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహాన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహాన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో చంద్రబాబును తిప్పికొట్టడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తెర మీదికి తెచ్చారు.

తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసు పార్టీని దాదాపుగా వదిలేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపైనే విరుచుకుపడ్డారు. మళ్లీ ఆంధ్రవాళ్ల పాలన కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు.

అదే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్కువ విమర్శలు చేస్తూ కేసీఆర్ పైనే ఎక్కువగా చంద్రబాబు గురిపెట్టారు. తెలంగాణవాళ్ల పాలన కావాలా అని అడిగారు. ఆంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్ ను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, కాంగ్రెసును గెలిపిస్తే అమరావతి నుంచి తెలంగాణ నిర్ణయాలు జరుగుతాయని కేసీఆర్ అన్నారు. అదే పద్ధతిలో జగన్ ను గెలిపిస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని, జగన్ ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ ను సామంత రాజ్యంగా చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ కావాలో, చంద్రబాబు కావాలో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్ల పాలన కావాలో, తెలంగాణవాళ్ల పాలన కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు

ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, ఉనికిని దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని చంద్రబాబు అన్నారు. ఇది తన సమస్య కాదని, ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల సమస్య అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపుగా ఇదే పద్ధతిలో మాట్లాడారు. తాను ఓడిపోతే ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటానని, ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు పరీక్ష అని అన్నారు. ఎపిలో జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అగ్నిపరీక్ష అని చంద్రబాబు అన్నారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించినట్లుగానే వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్ర సెంటిమెంట్ ను రగిలించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. జగన్ ను ఎదుర్కోవడానికి ఈ సెంటిమెంట్ బలంగా పనిచేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు.