MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీకి తలా రూ.50 లక్షలు ఇవ్వండి: జనసేన ఎంపీ బాలశౌరి

ఏపీకి తలా రూ.50 లక్షలు ఇవ్వండి: జనసేన ఎంపీ బాలశౌరి

భారీ వర్షాలు, వరదలతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్రాన్ని కోరారు. ఎంపీలందరూ తమ నిధుల నుంచి ₹50 లక్షలు కేటాయించాలని పిలుపునిచ్చారు.

2 Min read
Galam Venkata Rao
Published : Sep 05 2024, 11:01 PM IST| Updated : Sep 05 2024, 11:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఎంపీల నిధులు కేటాయించాలని పిలుపునిచ్చారు.

24
Severe damage to AP due to floods

Severe damage to AP due to floods

ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన విపత్తుపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మొదటి నుంచి యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వరద బాధితులకు నాలుగు రోజులుగా సాయం అందిస్తున్నారు. జిల్లాలో వరద ప్రభావం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు అనునిత్యం దిశానిర్దేశం చేశారు.

పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, మెరుగైన వసతుల కల్పనలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులను అప్రమత్తం చేశారు.

34
MP Balashowry Urges Center for Immediate Flood Relief to Andhra Pradesh

MP Balashowry Urges Center for Immediate Flood Relief to Andhra Pradesh

మరోవైపు, భారీ విపత్తు కారణంగా చిగురుటాకులా వణికిపోయిన ఆంధ్రప్రదేశ్‌ తిరిగి కోలుకునేలా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కోరారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. వరదలు, ఆకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశకు కలిగిన భారీ నష్టాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించి కేంద్రం, లోక్ సభ, రాజ్యసభలోని ఎంపీలందరూ ఆర్థిక సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. 

ముఖ్యంగా వరదల ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారని లేఖలో వివరించారు. వేల ఎకరాల్లో పంట నష్టం, లక్షల మంది ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి వచ్చేశారన్నారు.

రెండు జిల్లాల్లో కలిపి కనీసం 50 వరకూ ప్రాణనష్టం జరిగిందని, రహదారులు, కట్టలు, రైల్వే ట్రాక్‌లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. రెండు జిల్లాల్లో కలిపి కనీసం నాలుగు లక్షల మందికి పైగా ప్రజలపై వరదల ప్రభావం పడిందని, అన్ని రకాలుగానూ నష్టపోయారని వెల్లడించారు.

44
MP Balashowry Urges MPs for Flood Relief to Andhra Pradesh

MP Balashowry Urges MPs for Flood Relief to Andhra Pradesh

దశాబ్దాల చరిత్రలో ఇదే ప్రథమం..

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎన్నడూ లేనంతగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. గత 70 సంవత్సరాల చరిత్రలో ఇంతటి వరద రాలేదు. ప్రజలు అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుబారిన పడి సర్వస్వం కోల్పోయి, సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఉండే ప్రతి ఎంపీ సహకారం అందించాల్సిన సమయమిదని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

ఎంపీలందరూ ముందుకు రావాలి... 

2008లో బీహార్‌ రాష్ట్రంలోని కోసి నదికి వరదలు వచ్చిన సమయంలో రాజ్యసభ, లోక్‌సభలోని సభ్యులు వారి ఎంపీ ల్యాడ్స్ నిధులతో సాయం అందించారు. ఒక్కొక్కరూ రూ. 10 లక్షల చొప్పున, ఒక నెల జీతం ఇచ్చి ఆదుకున్న విషయాన్ని బాలశౌరి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం ఏపీకి అంతకంటే తీవ్రమైన ప్రకృతి విపత్తు వచ్చిందని, ఒక్కో ఎంపీ కనీసం రూ. 50 లక్షల చొప్పున నిధులు ఇచ్చి సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీహార్ విపత్తు సమయంలో ఎంపీలందరికీ అప్పట్లో లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ లేఖలు రాయడంతో ఎంపీలు అందరూ స్పందించారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎంపీలకు లేఖలు రాయాలని ఎంపీ బాలశౌరి కోరారు. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved