Asianet News TeluguAsianet News Telugu

డాల్బీ ఆడియోతో కొత్త ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ లాంచ్....

భారతదేశంలో వి‌యు  కంపెనీ రెండు కొత్త టి‌విలను లాంచ్ చేసింది. 32 అంగుళాల ప్రీమియం టీవీ ధర రూ. 10,999 కాగా, వి‌యు ప్రీమియం 43 అంగుళాల టీవీ ధర రూ. 19.999.

vu premium 32 and 43 inch tv launch in india on flipkart
Author
Hyderabad, First Published Feb 22, 2020, 4:27 PM IST

భారతదేశంలో వి‌యు  కంపెనీ వి‌యు ప్రీమియం టీవీ సిరీస్ డాల్బీ ఆడియో, డిటిఎస్ స్టూడియో సౌండ్ ఇంటిగ్రేషన్‌తో ఇండియలో లాంచ్ అయ్యింది. కొత్త టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. కంపెనీ  అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా  విక్రయించనున్నారు. అయితే వి‌యు ఇంకా అధికారికంగా దాని లాంచ్ తేదీని ప్రకటించలేదు.

ఇది ప్రస్తుతం 32-అంగుళాల, 43-అంగుళాల స్మార్ట్ టీవీ మోడళ్లను కలిగి ఉంది. ఇవి రెండూ టీవీలు ఇంటర్నల్ బిల్ట్ ఇన్  గూగుల్ క్రోమ్‌కాస్ట్‌తో  వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓ‌టి‌టి) యాప్ తో పాటు వియు టెక్నాలజీస్ రెండు టీవీ మోడళ్లలోనూ ఆండ్రాయిడ్ టీవీ 9 పైని అందించింది.

also read ఇండియన్ ఐటీ కంపెనీల్లో టెన్షన్: భయపెడుతున్న కరోనా

తాజా వి‌యు టీవీల్లో క్వాడ్ కోర్ ప్రాసెసర్లు, 1 జీబీ ర్యామ్ కూడా ఉన్నాయి. కొత్త శ్రేణి వి‌యు టీవీలు షియోమి  ఎం‌ఐ టివి 4ఎ ప్రో మోడళ్లకు పోటీగా లాంచ్ చేయనున్నారు. భారతదేశంలో వి‌యు ప్రీమియం 32 అంగుళాల టీవీ  ధర రూ. 10,999 కాగా, వి‌యు ప్రీమియం  43 అంగుళాల టీవీ ధర రూ. 19.999. రెండు కొత్త టీవీ మోడళ్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

టీవీలను లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఐదు శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు.ఈ రెండు ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోళ్ళు చేసిన వాటిపైనే పరిమితంగా ఉంచారు. అదనంగా, నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ. 917 నుండి ప్రారంభమవుతుంది.

also read  ఏజీఆర్ బకాయిల వల్లే 5జీ ట్రయల్స్ ఆలస్యం?

ఎం‌ఐ 4ఎ ప్రో 32-అంగుళాల టివి హెచ్‌డి మోడల్ ధర రూ. 12,499 కాగా, ఎం‌ఐ 4ఎ ప్రో 43-అంగుళాల ఫుల్-హెచ్‌డీ మోడల్ ధర రూ. 21.999. 32 అంగుళాల మోడల్ టీవీలో 20W బాక్స్ స్పీకర్‌, 43 అంగుళాల మోడల్‌లో 24W బాక్స్ స్పీకర్ కలిగి ఉంది. రెండు మోడళ్లు డాల్బీ డిజిటల్, డిటిఎస్ స్టూడియో సౌండ్ ఇంటిగ్రేషన్‌తో వస్తాయి. అంతేకాకుండా, టీవీలు వెసా వాల్ మౌంట్, టేబుల్ స్టాండ్‌తో కలిసి వస్తాయి.

డిస్ ప్లే, స్పీకర్లు మినహా కొత్త వి‌యు ప్రీమియం టీవీ మోడల్స్ రెండూ దాదాపు ఒకేలాంటి హార్డ్‌వేర్‌ను కలిగి ఉన్నాయి. ఇవి 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1 జీబీ ర్యామ్‌తో 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. టీవీల్లో డ్యూయల్ కోర్ జీపీయూ కూడా ఉంది. రెండు కొత్త  ప్రీమియం వి‌యు టీవీ మోడళ్లు గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆండ్రాయిడ్ టీవీ 9 పైతో పనిచేస్తాయి.

అంతేకాకుండా వినియోగదారులు టి‌వి కంటెంట్‌ను ఆండ్రాయిడ్, మాకోస్ లేదా విండోస్ డివైజ్ నుండి నేరుగా వారి టీవీలకు ప్రసారం చేయడానికి గూగుల్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉంది. రెండు కొత్త వి‌యు ప్రీమియం టీవీల్లో కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్ వి5.0, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, లాన్, ఆర్‌ఎఫ్, హెడ్‌ఫోన్ జాక్, ఆప్టికల్ ఆడియో కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లను యాక్సెస్ చేయడానికి ఐదు హాట్‌కీలు రిమోటులో ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios