Asianet News TeluguAsianet News Telugu

యుసి బ్రౌజరులో కొత్త ఫీచర్...ఇక ఫొటోలు, వీడియోలు, నేరుగా.....

 యుసి బ్రౌసర్ యుసర్ల మొబైల్ ఫోన్లలో ఉన్న వీడియోలు, పాటలు, ఫోటోలు మరెన్నో యుసి డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు. యుసర్లు తమ మొబైల్ ఫోన్లో యుసి బ్రౌజర్‌లో అప్‌స్టొరేజ్ లేదా మెమరీని కాకుండా బ్రౌజ్ చేసేటప్పుడు అనేక రకాల డౌన్‌లోడ్ చేయగల కంటెంట్‌ను నేరుగా యుసి డ్రైవ్ లోకి సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

uc browser now launches app cloud storage to users
Author
Hyderabad, First Published Jan 8, 2020, 5:20 PM IST

యుసి డ్రైవ్ ఇప్పుడు యుసి బ్రౌసర్ యుసర్ల మొబైల్ ఫోన్లలో ఉన్న వీడియోలు, పాటలు, ఫోటోలు మరెన్నో యుసి డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు. యుసర్లు తమ మొబైల్ ఫోన్లో యుసి బ్రౌజర్‌లో అప్‌స్టొరేజ్ లేదా మెమరీని కాకుండా బ్రౌజ్ చేసేటప్పుడు అనేక రకాల డౌన్‌లోడ్ చేయగల కంటెంట్‌ను నేరుగా యుసి డ్రైవ్ లోకి సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

also read మనుషుల్లాగే మాట్లాడే డిజిటల్​ మనుషులు... శామ్‌సంగ్ ల్యాబ్స్ సృష్టి

మొబైల్ బ్రౌజర్ మార్కెట్‌పై 1.1 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో పేరొందిన థర్డ్ పార్టీ మొబైల్ బ్రౌజర్ గా యుసి బ్రౌజర్ నిలిచింది. ఇప్పుడు  ఇండియన్ మార్కెట్ కోసం తన కొత్త వ్యూహాన్ని ప్రకటించింది.భారతీయ వ్యక్తిగత యూసర్లు యుసి బ్రౌజర్ ఇపుడు యుసి డ్రైవ్, ఇన్-యాప్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ ఆఫర్‌ను ప్రారంభించనుంది.

uc browser now launches app cloud storage to users

యుసి డ్రైవ్  యుసి వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ఉన్న వివిధ వీడియోలు, పాటలు, ఫోటోలు మరియు మరెన్నో  యుసి డ్రైవ్ లో  స్టోర్ చేసుకోవచ్చు. యుసి వినియోగదారులందరికీ యుసి డ్రైవ్ ఉచితంగా లభిస్తుంది. ప్రపంచ మార్కెట్లో యుసి డ్రైవ్ మొదటి లాంచ్ ఇది. అతిపెద్ద మార్కెట్లలో యుసి బ్రౌజర్ కి భారతదేశం  ఒకటి, దాని ప్రపంచ డౌన్‌లోడ్‌లలో 50% వరకు ఉంది.

also read అమెజాన్ నుండి కొత్త ఎకో డివైజ్... కారులో ప్రయాణించేటప్పుడు....

యుసివెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ హువాయువాన్ యాంగ్ మాట్లాడుతూ, “భారతదేశం వంటి మొబైల్-ఫస్ట్ మార్కెట్లో, దాదాపు అన్ని డిజిటల్ కార్యకలాపాలు మొబైల్ డివైజ్లకు మారుతున్నాయి. సినిమాలు చూడటం, ఫోటోలు క్లిక్ చేయడం నుండి ఫైల్స్ షేర్ చేయటం వరకు. యుసి డ్రైవ్‌తో, మా వినియోగదారులు తక్కువ మొత్తంలో మొబైల్ డేటాను ఉపయోగించి గొప్ప బ్రౌజింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు,  

రాబోయే యుసి డ్రైవ్ మా బిలియన్ యూసర్లకు మెరుగైన మొబైల్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి అలాగే ఇండియాలోని డిజిటల్ మార్కెట్లో ఎదగడానికి మా కమిట్ మెంట్లో ఇది ఒక అడుగు. ”బ్రౌజింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇంటెగ్రేట్ చేయబడిన యుసి డ్రైవ్, “సేవ్  టు డ్రైవ్‌ ” ఆప్షన్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేయగల ఏదైనా కంటెంట్‌ను సేవ్ చేయడానికి యూసర్లకు అనుమతిస్తుంది. అలాగే మీ ఫోన్‌లోని ఏదైనా ఫోల్డర్‌ను క్లౌడ్ స్టోరేజ్‌తో కూడా సింక్ చేయవచ్చు. ​

Follow Us:
Download App:
  • android
  • ios