Asianet News TeluguAsianet News Telugu

రెడ్​మీకి పోటీగా రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్....

భారత విపణి​లో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్ ​మీ రూపొందించిన ‘5ఐ’ మోడల్ ఫోన్ విడుదలైంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్​మీ 2020లో భారత్​లో విడుదల చేసిన మొదటి స్మార్ట్​ఫోన్ ఇదే.
 

Realme 5i Launch in India Today Expected Price in India, features
Author
Hyderabad, First Published Jan 9, 2020, 2:22 PM IST

న్యూఢిల్లీ: రియల్​ మీ 5 సిరీస్​​లోని మరో సరికొత్త ఫోన్​ రియల్​ మీ 5ఐ గురువారం భారత్​ మార్కెట్​లో విడుదల కానుంది. చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్​మీ 2020లో భారత్​లో విడుదల చేస్తున్న మొదటి  ఇదే.ఈ నెల ఆరో తేదీన వియత్నాం కేంద్రంగా గ్లోబల్ మార్కెట్లో రియల్​మీ 5ఐ ఆవిష్కరించబడింది. అయితే, అంతకుముందే రియల్​మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్​ తన ట్విట్టర్ ఖాతాలో రియల్​మీ 5ఐ టీజర్ పోస్ట్ చేశారు. 

also read జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్... ఇక దేశమంతా జియో ఫ్రీ..కాల్స్....

ఈనెల తొమ్మిదో తేదీన ఈ స్మార్ట్​ఫోన్​ను భారత్​లో విడుదల చేస్తున్నట్లు రియల్​మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్ స్పష్టం చేశారు. రియల్​మీ తన అధికారిక వెబ్​సైట్​లో రియల్​ 5ఐ కోసం ప్రత్యేకంగా ఓ ల్యాండింగ్​ పేజీని కూడా ఏర్పాటుచేసింది.రియల్​మీ 5ఐ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్​డీ+(720X1600 పిక్సెల్​), ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే, వాటర్​ డ్రాప్​ నాచ్​ లేదా మినీ డ్రాప్​ నాచ్, ​స్నాప్​డ్రాగన్​ 665 చిప్​సెట్, ​5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 

Realme 5i Launch in India Today Expected Price in India, features

రియల్​మీ యూఐ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. అది అందుబాటులోకి వచ్చేంత వరకు రియల్​మీ 5ఐ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా పనిచేసే కలర్ ఓఎస్​ 6.2తో నడుస్తుంది. ఎంట్రీ లెవల్ వినియోగదారులకు ఇది బాగా అక్కరకు వస్తుంది. ఈ ఫోన్‌లో క్వాడ్​ కెమెరా సెటప్​ ఉండొచ్చు. అయితే అధికారికంగా నిర్ధారణ కాలేదు. 

also read యుసి బ్రౌజరులో కొత్త ఫీచర్...ఇక ఫొటోలు, వీడియోలు, నేరుగా.....

రియల్ మీ 5ఐ ఫోన్‌లో 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్​ సెన్సార్​, మాక్రో కెమెరా ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఫోన్ రెడ్​మీ 8కి పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. రియల్ మీ 5ఐని రెడ్​మీ 8కి పోటీగా తీసుకొస్తున్నట్లు భావించవచ్చు. భారత్​లో ఈ స్మార్ట్​ఫోన్ ధర సుమారుగా రూ.7,999 నుంచి రూ.8,999 మధ్య ఉండొచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios