బీట్స్ బై డ్రే వెబ్‌సైట్‌లో ఆపిల్ కొత్త పవర్‌బీట్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు పవర్‌బీట్స్ 3ని రిప్లేస్ చేస్తాయి. అయితే వీటిని పవర్‌బీట్స్ 4 అని కాకుండా కేవలం ‘పవర్‌బీట్స్’ అని తెలిపింది. పవర్‌బీట్స్ ప్రో అదే డిజైన్ తో $ 149.95 (సుమారు రూ. 11,000)ధరకు అందిస్తున్నారు. పవర్‌బీట్స్ 3 కంటే $ 50 సుమారు రూ. 3,600 తక్కువ ధరకే లభిస్తుంది.

కానీ అధికారిక  వెబ్‌సైట్ లో $ 149.95 ధర లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే అని పేర్కొంది. అవి యు.ఎస్‌ దేశంలో బుధవారం నుండి బ్లాక్, రెడ్, వైట్ అనే మూడు ఆప్షన్స్ లో లభిస్తాయి.

 also read డ్యూయల్ పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో షియోమి ఎం‌ఐ కార్ ఛార్జర్...

కొత్త పవర్‌బీట్స్ టెథర్డ్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లకు వస్తే 15 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్  అలాగే 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 1 గంట వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని ఆపిల్ పేర్కొంది. పవర్‌బీట్స్ 3 బ్యాటరీ లైఫ్ 12 గంటల మాత్రమే. చెమట, వాటర్ రెసిస్టంట్, రౌండ్ కేబుల్ కలిగి ఉంటాయి.

కొత్త పవర్‌బీట్స్ ఆడియో షేరింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది రెండు సెట్ల బీట్స్ హెడ్‌ఫోన్స్ లేదా ఎయిర్‌పాడ్స్‌కు ఒకే ఐఫోన్‌ కి కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. మల్టీ ఆన్-ఇయర్ మైక్రోఫోన్‌, ఆన్-ఇయర్ కంట్రోల్ తో సాంగ్స్ , కాల్స్, వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేయడానికి మీకు వీలుగా ఉంటుంది.

also read అతి తక్కువ ధరకే కోడాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ...

సింగిల్ టచ్ బటన్‌ నొక్కడం ద్వారా సిరిని యాక్టివేట్ చేయడానికి పవర్‌బీట్‌లకు సపోర్ట్ కూడా ఉంది.ఇవి ఆపిల్ హెచ్1చిప్, క్లాస్ 1 వైర్‌లెస్ బ్లూటూత్ వంటి పవర్‌బీట్స్ ప్రోలో ఉండే కాన్ఫిగరేషన్ దీనిలో ఉన్నాయి.

పవర్‌బీట్స్ ప్రో పూర్తిగా వైర్‌లెస్ డిజైన్‌. 9 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్ ఇస్తుంది. వీటి ధర $ 249 (సుమారు రూ. 18,400), కొత్త పవర్‌బీట్‌ల కంటే చాలా ఖరీదైనవి. మార్చి 18 నుండి ఇవి అందుబాటులో ఉంటాయి.