Asianet News TeluguAsianet News Telugu

FIFA World Cup: సెక్స్ చేస్తే ఏడేండ్ల జైలు.. పార్టీలకు అనుమతి లేదు.. ఖతార్ లో కథ వేరే ఉంటది మరి..

Sex Ban In FIFA World Cup 2022: సాకర్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిపా ప్రపంచకప్ - 2022 ఈ ఏడాది నవంబర్ నుంచి ఖతార్ లో జరుగనుంది. అయితే ఆ దేశం మ్యాచులను చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. 

Sex Ban and No parties, 7 year jail For Violations: Ahead Of FIFA World Cup 2022, Qatar issues stern Orders
Author
India, First Published Jun 22, 2022, 5:46 PM IST

ఫుట్బాల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA World Cup-2022 ఈ ఏడాది నవంబర్ లో ఎడారి దేశం ఖతార్ లో జరగనుంది.  ఈ మేరకు  ఖతార్ లో  ఫుట్బాల్ స్టేడియాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈసారి ఖతార్ లో ఆటను ఆనందించడానికి మాత్రమే తప్ప మిగతా ఎంజాయ్మెంట్ కు అక్కడ అనుమతి లేదు.  సెక్స్ తో పాటు మందు పార్టీలపై ఖతార్ కఠిన నిషేధం విధించింది. కర్మకాలి.. కక్కుర్తి పడి ఎవరితో అయినా సెక్స్ చేస్తే మాత్రం ఏడేండ్ల పాటు అరబిక్ జైళ్లల్లో మగ్గిపోవాల్సిందే. దీని కథా కమామీషు ఏంటో చదవండి మరి.. 

యూరోపియన్ దేశాలలో ఫుట్బాల్  ఈవెంట్లంటే మ్యాచులకు ముందు పార్టీలు.. వేశ్యలతో సెక్స్ సర్వసాధారణాంశం.  బ్రెజిల్, అర్జింటీనా, స్పెయిన్ తో పాటు యూకేలో నిర్వహించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో ఇవన్నీ చాలా సాధారణం. కానీ ఖతార్ లో కాదు. అక్కడ కథ వేరే ఉంది. 

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు భార్యాభర్తలైతే తప్ప  గర్ల్ ఫ్రెండ్, లవర్స్ తో శృంగారం చేసుకునే అవకాశం లేదు. ఈ మేరకు వరల్డ్ కప్ నిర్వాహకులు స్పందిస్తూ... ‘ఈ ప్రపంచకప్ లో మ్యాచ్ తర్వాత పార్టీలు నిషేధం. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు దానిని ఆస్వాదించాలే తప్ప  పార్టీలు, సెక్స్ అని తిరిగితే జైళ్లకు వెళ్లడం ఖాయం.  ప్రపంచకప్ జరిగే ప్రాంతాలలో సెక్స్ నిషేధం ఉంది. భార్యాభర్తలైతే తప్ప ఇతర వ్యక్తులతో శృంగారం నిషిద్ధం. ఇందుకు  ఫ్యాన్స్ ప్రిపేర్ అయి రావాలి..’ అని తెలిపారు.  ఫిఫా ప్రపంచకప్ ఈవెంట్లలో సెక్స్ ను నిషేధించడం ఫుట్బాల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

 

సాంప్రదాయక ముస్లిం దేశంగా ఉన్న ఖతార్.. విచ్చలవిడి సెక్స్ తో పాటు ఎల్జీబీటీక్యూ ల మీద కఠినంగా వ్యవహరిస్తున్నది. వివాహం కాని వారు శృంగారంలో పాల్గొన్నట్టు తేలితే అక్కడ శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. ఆ హద్దులు మీరితే చచ్చినట్టు ఏడేండ్ల పాటు జైలు కూడా తినాల్సిందే. ఒక్క రాత్రికి కక్కుర్తి పడితే ఏడేండ్ల పాటు  చిప్పకూడు తప్పదని  ఖతార్ పోలీసులు చెప్పకనే చెబుతున్నారు.  ఇక ఖతార్ తాజా ఆదేశాలతో ఫుట్బాల్ ఫ్యాన్స్  తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 

ఇక ఫిఫా వరల్డ్ కప్ విషయానికొస్తే.. నవంబర్ 21న ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ లో డిసెంబర్ 3 వరకు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 3 నుంచి నాకౌట్ దశ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది.  8 గ్రూపులుగా విడగొట్టిన ఈ ప్రపంచకప్ లో ఒక్కో గ్రూప్ నుంచి 4 జట్లున్నాయి. మొత్తంగా 32 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో విజేత ఎవరవుతారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios