Asianet News TeluguAsianet News Telugu

`క్రాక్‌` డీల్ జీ టీవి ఎందుకు వద్దనుకుంది?

దాదాపు షూటింగ్ పూర్తి చేసిన  `క్రాక్` సినిమా థియోటర్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం జీటీవి గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి చర్చలు జరిపింది. నిర్మాతలతో దాదాపు డీల్ పైనల్ అయ్యిందనుకున్న టైమ్ లో జీ టీవి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే శాటిలైట్ ఛానెల్స్ తో శాటిలైట్,డిజిటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. 

Zee group backs off from Ravi Tejas Krack! JSP
Author
Hyderabad, First Published Nov 12, 2020, 9:15 AM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసిన  `క్రాక్` సినిమా థియోటర్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం జీటీవి గ్రూప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి చర్చలు జరిపింది. నిర్మాతలతో దాదాపు డీల్ పైనల్ అయ్యిందనుకున్న టైమ్ లో జీ టీవి వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. కారణాలు ఏంటనేది తెలియరాలేదు. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే శాటిలైట్ ఛానెల్స్ తో శాటిలైట్,డిజిటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్యన టీవీల్లో వచ్చిన సాహో,భీష్మ సినిమాలు టీఆర్పీ పరంగా భారీ దెబ్బ కొట్టడంతో ఈ సినిమా రైట్స్ తక్కువ రేటుకు అడుగుతున్నట్లు వినపడుతోంది.

మరో ప్రక్క 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. చిత్రం షూటింగుకు సంబంధించి ఒక పాట షూటింగ్ మినహా అంతా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు.ఈ చిత్రంలో వరలక్షీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్స్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్రం టీమ్ చెబుతోంది. తమిళ నటులు సమద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్ డివిజన్‌పై బి మధు నిర్మిస్తోన్న చిత్రానికి తమన్ సంగీతం, జికె విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios