Asianet News TeluguAsianet News Telugu

27 రోజులు జైల్లో నరకం, సహజీవనం వేస్ట్... అరెస్ట్ పై యూట్యూబర్ చందు సాయి ఓపెన్ కామెంట్స్ 

రేప్, చీటింగ్ కేసులో అరెస్ట్ కాబడిన యూట్యూబర్ చందు సాయి కీలక కామెంట్స్ చేశాడు. జైలు నుండి బయటకు వచ్చిన చందు సాయి జైల్లో నరకం అనుభవించానని వెల్లడించాడు. అబ్బాయిలకు రక్షణ లేదని వాపోయాడు. 
 

youtuber chandoo sai opens up on arrest in rape case ksr
Author
First Published Feb 22, 2024, 8:30 PM IST

యూట్యూబర్ చందు సాయి కి యూత్ లో ఫేమ్ ఉంది. అతడు షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యాడు. పక్కింటి కుర్రాడు ఛానల్ లో చందు సాయి తన వీడియోలు పోస్ట్ చేసేవాడు. పక్కింటి కుర్రాడు గా పాప్యులర్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ లో చందు సాయి అరెస్ట్ అయ్యాడు. కాగా ప్రేమ పేరుతో మోసం చేశాడు. లైంగిక దాడి చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. 

చందు సాయి కి కోర్టు రిమాండ్ విధించింది. 27 రోజులు జైల్లో ఉన్న చందు సాయి బెయిల్ పై విడుదలయ్యాడు. తన అరెస్ట్ అన్యాయం అన్న కోణంలో మాట్లాడాడు. ఒక మనిషి మీద పగ తీర్చుకోవడానికి ఇంత దూరం వెళ్ళకూడదు. అసలు జరగనిది చెప్పారు. నా కుటుంబ సభ్యుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. వాళ్ళు ఎంత బాధపడతారు. 27 రోజులు జైల్లో ఉన్నాను. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నాను. 

నేను అమ్మాయిని నిజంగా  ప్రేమించాను. రిలేషన్ లో ఉన్నాను. సహజీవనం చేయడం వేస్ట్. అది నాకు ఆలస్యంగా తెలిసింది. రిలేషన్ కాపాడుకోవడానికి నేను చాలా చేశాను. నేను తప్పు చేయలేదు. తిరిగి నా మీద కేసు పెట్టి షాక్ ఇచ్చింది. పక్కింటి కుర్రాడిగా సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది. ఒక సినిమా కోల్పోయాను. ఒక తప్పు జరిగితే అందులో ఇద్దరి ప్రమేయం ఉంటుంది. కానీ శిక్ష ఒక్కరికే పడుతుంది. సమాజంలో అబ్బాయిలకు రక్షణ లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి... అన్నాడు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios