ప్రొడక్షన్ మేనేజర్ తో యంగ్ హీరోయిన్ డేటింగ్!

First Published 4, Aug 2018, 4:11 PM IST
young heroine dating with production manager
Highlights

నిజానికి ఆమె పుట్టి, పెరిగింది మొత్తం ఫారెన్ లోనే కావడంతో ఆమెకి ఇలాంటి డేటింగ్స్ వ్యవహారాలు చాలా కామన్. కానీ హీరోయిన్ రేంజ్ కు తగ్గట్లుగా కాకుండా ఆమె ప్రొడక్షన్ మేనేజర్ తో డేటింగ్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేసింది ఓ యంగ్ హీరోయిన్. అల్ట్రా మోడర్న్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీకి మాస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. స్క్రీన్ మీద అందాల ఆరబోత విషయంలో పెద్దగా మొహమాటపడని ఈ బ్యూటీ ఆఫ్ స్క్రీన్ లో ఓ ప్రొడక్షన్ మేనేజర్ తో ఎఫైర్ నదిస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి.

నిజానికి ఆమె పుట్టి, పెరిగింది మొత్తం ఫారెన్ లోనే కావడంతో ఆమెకి ఇలాంటి డేటింగ్స్ వ్యవహారాలు చాలా కామన్. కానీ హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఆమె ఓ ప్రొడక్షన్ మేనేజర్ తో డేటింగ్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడి లుక్స్ కి ఎట్రాక్ట్ అయిన ఈ బ్యూటీ తనే స్వయంగా డేట్ కి రమ్మని పిలిచిందట. అంతేకాదు అతడితో చాలా సమయం గడుపుతుంది సమాచారం.

అయితే ఇది ఎక్కువకాలం సాగే రిలేషన్ కాదని అమ్మడు ముందుగానే క్లారిటీ కూడా ఇచ్చిందని అంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ స్టార్ హోటల్ లో గడపడంతో ఈ విషయం కాస్త బయటకి పొక్కింది. మరి ఈ బ్యూటీ ఇంకెంతకాలం ప్రొడక్షన్ మేనేజర్ తో ఎఫైర్ సాగిస్తుందో చూడాలి! 

loader