Asianet News TeluguAsianet News Telugu

సత్యదేవ్‌తో మిల్కీ బ్యూటీ.. క్రేజీ రీమేక్‌

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా  భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

Young hero, Satya Dev and Tamannaah to star in 'Love Mocktail' Telugu remake
Author
Hyderabad, First Published Jul 14, 2020, 3:38 PM IST

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో సత్యదేవ్‌. హీరోగా కొనసాగుతూనే స్పెషల్ క్యారెక్టర్స్‌ కూడా చేస్తున్న సత్యదేవ్‌, తాజాగా వెబ్ సిరీస్‌లలోనూ సత్తా చాటుతున్నాడు. ఇక టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా  భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు.

అలానే ఈ చిత్రానికి యంగ్‌ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు. సత్యదేవ్‌ పర్ఫామెన్స్‌కి, మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ తోడై సినిమా మంచి  సక్సెస్‌ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

Follow Us:
Download App:
  • android
  • ios