మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌. ఆయన స్టైల్స్‌, డ్యాన్స్‌, యాక్టింగ్, కామెడీ టైమింగ్‌ లాంటివి చూస్తూ ఓ జనరేషన్ అంతా ఇన్స్‌పైర్‌ అయ్యిందంటే ఏమాత్రం అతిషయోక్తి కాదు. అందుకే ఆయనతో ఉన్న ప్రతీ చిన్న జ్ఞాపకాన్నీ పదిలంగా భద్ర పరుచుకుంటారు. సామాన్యులే కాదు ఫిలిం స్టార్స్‌ కూడా మెగాస్టార్‌తో తమ అనుబంధాన్ని అనుభవాలను తలుచుకొని తలుచుకొని పొంగిపోతుంటారు. తాజాగా అలాంటి ఓ అరుదైన విషయాన్నే ఓ యంగ్ హీరో అభిమానులతో పంచుకున్నాడు. ఓ త్రో బ్యాక్‌ ఫోటోతో అందరికీ షాక్‌ ఇచ్చాడు.

డైలాగ్‌ కింగ్ సాయి కుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన యంగ్ హీరో ఆది. నటుడి మంచి పేరు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్‌ కోసం ఇప్పటికీ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆది. ఈ యంగ్ హీరో మంగళవారం ఓ త్రో బ్యాక్‌ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. కలికాలం సినిమా శత దినోత్సవ వేడుక సందర్భంగా తీసిన ఆ ఫోటోలో చిరు, ఆదిని ఎత్తుకొని అవార్డు అందిస్తున్నాడు. ఆ వేడుకకు సాయి కుమార్ హాజరుకాలేకపోవటంతో ఆయన తరుపున ఆది అవార్డును అందుకున్నాడు.

ఆది పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆపరేషన్ గోల్డ్‌ ఫిష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. కార్తీక్‌ , విఘ్నేష్‌ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ జంగల్‌తో పాటు శశి అనే సినిమాలోనూ నటిస్తున్నాడు ఆది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#majorthrowback @chiranjeevikonidela kalikalam 100 days function taking the award on behalf of dad .

A post shared by ActorAadi (@aadipudipeddi) on May 18, 2020 at 10:04pm PDT