Asianet News TeluguAsianet News Telugu

రాజ్ కుంద్రా బలవంతంగా నాతో పోర్న్ వీడియోలు చేయించాడు

 రాజ్ కుంద్రా కు చెందిన హాట్ షాట్స్ యాప్ కోసం పోర్న్ వీడియో లలో నన్ను బలవంతంగా నటింపచేశాడని ఓ నటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుంద్రా అండ్ టీమ్ కారణంగా తాను ఇబ్బందుల పాలైనట్లు ఆ నటి తెలియజేశారు. 
 

young actress made sensational comments on raj kundra ksr
Author
Hyderabad, First Published Jul 29, 2021, 7:48 AM IST

పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన రాజ్ కుంద్రా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోర్న్ కంటెంట్ చిత్రీకరణ, ప్రదర్శన ద్వారా రాజ్ కుంద్రా కోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్లు ఆధారాలు లభించాయి. అలాగే కొందరు హీరోయిన్స్ ని రాజ్ కుంద్రా ఈ ఊబిలోకి లాగి, ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. హీరోయిన్స్ అవుదామనే ఆశలతో ముంబై వచ్చిన కొందరు యంగ్ హీరోయిన్స్ ని తన పోర్న్ యాప్ కోసం, వీడియోలలో నటించేలా ప్రోత్సహించాడని, కొందరిని బలవంతంగా పోర్న్ వీడియోలలో నటించేలా చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


తాజాగా ఓ నటి ఇలాంటి ఆరోపణలే చేశారు. రాజ్ కుంద్రా కు చెందిన హాట్ షాట్స్ యాప్ కోసం పోర్న్ వీడియో లలో నన్ను బలవంతంగా నటింపచేశాడని ఓ నటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుంద్రా అండ్ టీమ్ కారణంగా తాను ఇబ్బందుల పాలైనట్లు ఆ నటి తెలియజేశారు. 


కొద్దిరోజుల క్రితం ముంబై శివారులోని ఓ భవంతిలో పోర్న్ వీడియోల చిత్రీకరణ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి కొందరి అరెస్ట్ చేశారు. హీరోయిన్ గహన వశిష్ఠ ఈ దాడిలో పట్టుబడ్డారు. అరెస్ట్ అనంతరం గహన వసిష్ఠను జైలుకు తరలించడం జరిగింది. ఆమె విచారణలో రాజ్ కుంద్రాకు సంబంధించిన పలు చట్ట వ్యతిరేక చర్యలు బయటపెట్టినట్లు సమాచారం. 

ప్రస్తుతం వశిష్ఠ బెయిల్ పై బయటికి వచ్చారు. మరోవైపు రాజ్ కుంద్రా పై విచారణ కొనసాగుతుంది. ఆయనకు బెయిల్ నిరాకరించిన కోర్ట్, కస్టడీ సమయం ఇంకా పొడిగించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios