బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ఆరవ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. నేటి ఎపిసోడ్ లో చెప్పుకోదగ్గ ఆసక్తికర విషయాలేమి జరగలేదని చెప్పొచ్చు. తన పక్కనే వుంటూ వెన్నుపోటు పొడిచే ఆ కట్టప్ప ఎవరనేది బిగ్ బాస్ బయటపెట్టలేదు. కాగా ఇంటి సభ్యులను తాము ఎవరిని కట్టప్ప అని భావిస్తున్నారో కారణం చెప్పి, ఆ వ్యక్తి ముఖంపై కట్టప్ప అనే స్టాంప్ వేయాలని ఆదేశించాడు. 

ఇక ఇంటి సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తూ కంటెస్టెంట్స్ పై కట్టప్ప స్టాంప్ వేశారు. ఈ గేమ్ లో ఎక్కువ మంది లాస్యను కట్టప్పగా భావించడం విశేషం. ఆమె ముఖంపై ఎక్కువ కట్టప్ప స్టాంప్స్ పడ్డాయి. 

ఈ టాస్క్ లో భిన్నంగా నోయల్ తనకు తాను స్టాంప్ వేసుకోవడానికి ప్రయత్నించాడు. తనకు ఎవరినీ హర్ట్ చేయడం ఇష్టం లేదని అందుకే తనకు తానే కట్టప్ప స్టాంప్ వేసుకుంటానని అన్నారు. దీనికి మిగతా ఇంటి సభ్యులతో పాటు, బిగ్ బాస్ అభ్యన్తరం తెలిపారు. దీనితో స్నేహితుడనే కారణంతో అమ్మ రాజశేఖర్ ముఖంపై కట్టప్ప స్టాంప్ వేశాడు నోయల్. 

ఇక ఈ విషయంలో నోయల్ మరియు సోహైల్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ షోలో ఫేవరేట్ కంటెస్టెంట్ గా ఉన్న గంగవ్వ కూడా రాజశేఖర్ మాస్టర్ నే కట్టప్పగా అనుమానించి స్టాంప్ వేయడం గమనార్హం. పెద్దగా హై డ్రామాలేని నేటి ఎపిసోడ్ కూడా చప్పగా ముగిసింది.