ఆడపిల్లని చేసి ఆడుకుంటున్నావ్, పుల్లలు పెడుతున్నావ్.. నామినేషన్స్ లో పీక్స్ కి చేరిన యావర్, అశ్విని గొడవ
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మంగళవారం రోజు కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 8 మంది సభ్యులు ఈవారం నామినేషన్స్ లో నిలిచారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మంగళవారం రోజు కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 8 మంది సభ్యులు ఈవారం నామినేషన్స్ లో నిలిచారు. మొహానికి రంగు కొట్టించుకునే నామినేషన్స్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య గిల్లి కజ్జాలతో సాగింది.
ముందుగా శోభా శెట్టి, రతిక నోటికి పదును చెబుతూ వాగ్వాదం చేసుకున్నారు. మధ్యలో తేజ కూడా తోడయ్యాడు. శోభా శెట్టికి బ్యాలెన్సింగ్ క్వాలిటీ లేదని రతిక ఆమెని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించింది. అది గుర్తు పెట్టుకున్న శోభా ఈరోజు రతికని నామినేట్ చేసింది.
ఇక ఈరోజు నామినేషన్స్ లో యావర్, అశ్విని మధ్య జరిగిన గొడవ హైలైట్ అయ్యింది. ఒకరినొకరు ముఖాలు విచిత్రంగా పెట్టి ఎగతాళి చేసుకుంటూ.. వెక్కిరిస్తూ నామినేట్ చేసుకున్నారు. యావర్ తనని అనవసరంగా నామినేట్ చేస్తున్నాడని అశ్విని వాపోయింది. దీనితో అశ్విని యావర్ పై రివేంజ్ తీర్చుకుంటూ అతడిని కూడా నామినేట్ చేసింది.
అవును నీపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే నిన్ను నామినేట్ చేస్తున్నా అని అని అశ్విని ఓపెన్ గా చెప్పింది. అనవసరంగా నన్ను కెలుకుతున్నావు అంటూ అశ్విని చెప్పడంతో.. అవును నాకు గోకించుకోవడం ఇష్టమే.. రా వచ్చి గోకు అంటూ యావర్ విచిత్రంగా బిహేవ్ చేశాడు. తనని ఆడపిల్లని చేసి ఆడుకుంటున్నావ్ అని అశ్విని చెప్పింది. లేడీ కార్డు వాడడంతో.. బిగ్ బాస్ హౌస్ లో ఆడపిల్లలు, అబ్బాయిలు వేరు కాదు అని నాగార్జున గారు చెప్పారే అంటూ యావర్ సెటైర్ వేశాడు. అశ్విని కూడా యావర్ ని వెక్కిరిస్తూ.. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చి పుల్లలు పెడుతున్నారో ఆంధ్ర, తెలంగాణ మొత్తం తెలుసు అంటూ డ్యాన్స్ చేసి చూపించింది.
అయితే అశ్విని తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఈ వారం అమర్ దీప్, రతికా, శోభా శెట్టి, ప్రియాంక ,అర్జున్, భోలే, తేజ, యావర్ నామినేషన్స్ లో నిలిచారు. అనంతరం బిగ్ బాస్ అబ్బాయిలకు.. అమ్మాయిలని మహారాణుల్లా చూసుకోవాలని టాస్క్ ఇచ్చారు. దీనితో తేజ.. శోభా శెట్టిని తీసుకువెళ్లడం, ఆమెకి బ్రష్ చేయించడం, టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేశాడు. ఇక ప్రశాంత్ తన పాత స్నేహితురాలు రతికకి బ్రేక్ ఫాస్ట్ తినిపించాడు.