వర్మ నా కథ మళ్ళీ కాపీ కొట్టాడు!

వర్మ నా కథ మళ్ళీ కాపీ కొట్టాడు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కథను కాపీ కొట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే సినిమాను తెరకెక్కించినట్లు వర్మ వద్ద రచయితగా పని చేసిన పి.జయకుమార్ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన కేసు హైదరాబాద్ సివిల్ కోర్టులో ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే తాజాగా మరోసారి జయకుమార్.. వర్మపై విరుచుకుపడ్డాడు. నాగార్జున హీరోగా వర్మ రూపొందించిన 'ఆఫీసర్' కథ కూడా కాపీ చేసి తీశారంటూ వ్యాఖ్యలు చేశారు జయకుమార్.

2015లో తను రాసిన కథను వర్మ కాపీ చేసి సినిమా చేస్తున్నాడని జయకుమార్ మీడియాకు వెల్లడించారు. 'హైదరాబాద్ కు చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ కోర్టు ఆర్డర్ల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా వ్యవహరిస్తారు. దీనికోసం ముంబై వెళ్లి అక్కడ  అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారిపై విచారణ చేపడతారు' ఇదే తను రాసుకున్న లైన్ అని జయకుమార్ అన్నారు. ఇటీవల ఆఫీసర్ సినిమా ట్రైలర్ చూశానని, అందులో సన్నివేశాలు, డైలాగులు చూసి షాక్ అయినట్లు చెప్పారు.

మూడేళ్ళ క్రితమే ఈ కథను వర్మకు మెయిల్ చేశానని, కొన్ని మార్పులు చెప్పడంతో అవన్నీ సరిచేసి మళ్ళీ పంపించానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వర్మకు తొమ్మిది కథలు పంపానని, అవి నచ్చలేదని పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ విషయంపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి! 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos