బాలీవుడ్ టీవీ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ పై ఇటీవల రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ నటికి ఇప్పుడు బెదిరింపులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరో కేసు కూడా నమోదైంది. 

తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి రేప్ చేసినట్లు వివేక్ పై కొన్ని రోజుల క్రితం 34 ఏళ్ల మహిళ  ఒషివొరా పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. అతడిపై ఐపీసీ 376(రేప్‌), 384 (దోపిడీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రీసెంట్ గా మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఆ మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బెదిరించారని తెలిపింది. 

బైక్ మీద వచ్చి యువకులు బ్లెడ్ తో గాయపరచి కేస్ వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు ఆమె పోలీసులకు తెలియజేశారు.పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు సిసి టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకుంటామని బాధిత మహిళకు పోలీసులు వివరణ ఇచ్చారు.

పవన్ సినిమాలు చేయక తప్పదు.. ఒకవేళ చేస్తే ఎవరితో?