టాలీవుడ్ సెక్స్ రాకెట్: మహిళా సంఘాల మండిపాటు!

women activists on tollywood sex racket
Highlights


కాస్టింగ్ కౌచ్ సంగతి మరువక ముందే అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఇండస్ట్రీను కుదిపేసింది

కాస్టింగ్ కౌచ్ సంగతి మరువక ముందే అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఇండస్ట్రీను కుదిపేసింది. ఇప్పటికే ఆరుగురు హీరోయిన్లు ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే మాటలు వినిపించాయి. అయితే ఈ విషయంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. కిషన్ పై సరైనా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. మహిళా సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ.. 

కళాకారులకు సంబంధించి వాళ్లు జూనియర్ ఆర్టిస్ట్స్ అయినా డైలాగ్ ఆర్టిస్ట్ అయినా..  బ్రోకర్ వ్యవస్థను తీసేసి నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు వేయాలని ఎఫ్.డి.సి సంస్థను కోరాం. దానికి తగ్గ పనులు చేస్తున్నామని అన్నారు. అలానే ఆడిషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ లో మధ్యలో కోఆర్డినేటర్లు ఫోటోలు పట్టుకొని తిరగడం అవి ఛాంబర్ కు ఇవ్వడం వంటి పనులు కాకుండా సెలెక్షన్ ప్రాసెస్ లో ఛాంబర్, ఎఫ్ డి సి అఫీషియల్ వెబ్ సైట్స్ ఏర్పాటు చేయాలి. ఇదంతా బహిరంగంగా జరగాలి. ఎంపిక చేసుకున్న నటీనటులతో ఎఫ్ డి సి ఆమోదించిన వాట్సాప్ గ్రూపుల నుండి కమ్యునికేషన్ జరగాలి.

సెక్సువల్ హెరాస్మెంట్ ఉండదనే హామీతో పాటు కొంత డబ్బు కూడా నటీనటుల అకౌంట్స్ లో డిపాజిట్ చేయాలి.షూటింగ్ సమయంలో జరగరానిది ఏమైనా జరిగితే అప్పుడు ఆ డబ్బు బాధితులకు సహాయంగా నిలుస్తుంది.సినిమాలలో పని చేయాలనే కాంక్షతో ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకు డాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కూల్స్ నుండి ఇబ్బందులు మొదలవుతున్నాయి.

వాటిని కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. ఛాంబర్స్, ప్రభుత్వం, కళాకారులతో కలిపి త్వరలోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. గత నాలుగు నెలలుగా ఈ సంఘటనలు జరుగుతున్నా.. ఇండస్ట్రీకు చెందిన వారు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. నటీమణులను అమెరికా తీసుకువెళ్లి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఎవరికీ వాళ్లు నోళ్లు మూసుకొని కూర్చున్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి ఇండస్ట్రీ పరువు తీసిందని అన్నవారు ఈ సెక్స్ రాకెట్ గురించి మాత్రం ఎందుకు స్పందించడం లేదు. విదేశాల్లో టాలీవుడ్ పరువు పోవచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

loader