సాధారణంగా ఎవరైనా వేధింపులకు గురి అవుతున్నారని తెలిస్తే ...దాన్ని ఆపేందుకు,అడ్డుకునేందుకు మహిళా సంఘాలు సీన్ లోకి వస్తూంటాయి. అలాగే సినిమాల్లో ఎక్కడైనా స్త్రీలను అసభ్యంగా చూపినా అడ్డుకుంటాయి. స్టార్ హీరోయిన్ రష్మిక నటించిన ఓ సినిమా విషయంలో ఇప్పుడు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రష్మికను ఘోరంగా వేధిస్తూ..ఓ సాంగ్ విడుదల చేసారు. పొగరు టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో రష్మికను హీరో తెగ టీజింగ్ చేస్తూంటాడు. అయితే అది టీజింగ్ లాగ కాకుండా.. వేధింపులులాగ ఉంది. వాళ్లు సరదాగా ఉంటుందని తీసారో లేక సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ అదేనేమో కానీ వివాదాస్పదం అయ్యింది. మహిళా సంఘాలు అన్ని మండిపడుతున్నాయి. ఆ వీడియోని యూట్యూబ్ నుంచి తీసేయమని డిమాండ్ చేస్తున్నాయి. 

తన మాతృభాష కన్నడంలో రష్మిక..అక్కడి యంగ్ హీరో ధృవ స‌ర్జతో పొగ‌రు సినిమాలో న‌టిస్తోంది. అందులో ఓ పాటలో హీరో ధృవ సార్జ హీరోయిన్ రష్మికను ఓ రేంజ్ లో  టీజ్ చేస్తుంటాడు. ఇది చూసిన త‌ర్వాత ఇప్పుడు మ‌హిళా సంఘాల‌కు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అని నిర్మాతకు వార్నింగ్ ఇస్తున్నాయి.  అలాగే  ఎంత సినిమా అయితే మాత్రం ఓ అమ్మాయిని ఇంత దారుణంగా టీజ్ చేస్తారా..అది చూసి ఎవరైనా ప్రేరణ పొంది బయిట కూడా చేస్తే పరిస్దితి ఏమిటి..ఇలాంటివి తీయటానికి నీకు అస‌లు సిగ్గుందా, ఫ్యామిలీ లేదా..వెంటనే క్షమాపణ చెప్పు అంటూ  ఆ ద‌ర్శ‌కుడిపై ఫైర్ అవుతున్నారు. 

అయితే ఇంత పబ్లిసిటీ వచ్చాక ఆ పాట జోరు ఇక ఆపగలమా. ఇప్ప‌టికే ఈ పాట‌ రేసుగుర్రంలా పరుగెడుతోంది. ఈ పాటకు యూ ట్యూబ్‌లో 8 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.  వెంట‌నే ఆ పాటను సినిమా నుంచి తీసేయాల‌ని.. లేదంటే సినిమా రిలీజ్ కానివ్వ‌మంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ విష‌యంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు . ధృవ సార్జ.. రష్మిక జంటగా నటించిన పొగరు చిత్రం ఎప్రిల్ 24న విడుదల కావాల్సి ఉండ‌గా ఇప్పుడు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డేలా క‌నిపిస్తుంది.