Asianet News TeluguAsianet News Telugu

బన్నీ రికార్డు ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బుల్లితెరపై సంచలనాలు చేస్తుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధిస్తుందా అనే ఉత్సుకత కొనసాగుతుంది. అల వైకుంఠపురంలో మూవీతో అల్లు అర్జున్ భారీ రికార్డు సెట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రసారం అయిన ఆ చిత్రం ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఏకంగా 29.4 టీఆర్పీ దక్కించుకుని టాలీవుడ్ లో అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. 
 

will prabhas breaks allu arjuns record ksr?
Author
Hyderabad, First Published Oct 12, 2020, 8:49 AM IST

గత ఏడాది విడుదలైన సాహో మిశ్రమ ఫలితాలు అందుకుంది.  సౌత్ లో నష్టాలు మిగిల్చిన ఈ చిత్రం నార్త్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సాహో హిందీ వర్షన్ మంచి ఆదరణ దక్కించుకుంది. 150 కోట్లకు పైగా వసూళ్లతో బాలీవుడ్ లో ప్రభాస్ మరోమారు సత్తా చాటాడు. కాగా ఈ చిత్రం మొదటిసారి బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. సాహో శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జీ తెలుగు అక్టోబర్ 18న ఆదివారం ప్రసారం చేయనుంది. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బుల్లితెరపై సంచలనాలు చేస్తుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధిస్తుందా అనే ఉత్సుకత కొనసాగుతుంది. అల వైకుంఠపురంలో మూవీతో అల్లు అర్జున్ భారీ రికార్డు సెట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రసారం అయిన ఆ చిత్రం ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఏకంగా 29.4 టీఆర్పీ దక్కించుకుని టాలీవుడ్ లో అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. 

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో 23.4 టీఆర్పీ దక్కించుకున్నారు. మహేష్ సెట్ చేసిన హైయెస్ట్ టీఆర్పీ ని అల్లు అర్జున్ బ్రేక్ చేయడం జరిగింది. కాగా అల వైకుంఠపురంలో మూవీ సెట్ చేసిన హైయెస్ట్ టీఆర్పీని ప్రభాస్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఐతే అది అంత ఈజీ కాదు. బన్నీ రికార్డుని బ్రేక్ చేయాలంటే ప్రభాస్ 30.0 టీఆర్పీ దక్కించుకోవాలి. యావరేజ్ ఫలితం దక్కించుకున్న మూవీతో ప్రభాస్ ఆ స్థాయి టీఆర్పీ దక్కించుకోవడం అంత సులభం కాదు. 

భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ కి అది సాధ్యం కాదని చెప్పలేం. థియేటర్స్ లో భారీ విజయాలు అందుకోకపోయినా బుల్లితెరపై మంచి ఆదరణ దక్కించుకున్న చిత్రాలు అనేకం. కాబట్టి సాహో అత్యధిక టీఆర్పీ దక్కించుకొని అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసే విషయాన్ని కొట్టిపారేయలేం. అక్టోబర్ 13న ప్రసారం కానున్న సాహో ఏమాత్రం ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios